రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన శైవ క్షేత్రాల్లో వేములవాడ ఒకటి. నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ముఖ్యంగా మహాశివరాత్రి వేళ భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే తాజాగా భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆలయ అధికారులు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువవచ్చారు. భక్తులకు ఆలయ సమాచారాన్ని వేగంగా, పారదర్శకంగా అందించేందుకు "వాట్సాప్ చాట్‌బోట్" సేవలను ప్రారంభించారు.

మహాశివరాత్రి జాతర ప్రారంభమైన నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఈ డిజిటల్ సేవలు ఎంతో ఊరటనివ్వనున్నాయి. “Services in just a Few Clicks” అనే సందేశంతో భక్తులకు అవసరమైన సమాచారం మరియు సేవలను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఎలా ఉపయోగించాలి…?
ఆలయ పరిసరాల్లో అధికారులు ఏర్పాటు QR కోడ్ స్కాన్ చేయవచ్చు. లేదా 8736936969 నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపాలి. అలా చేస్తే వెంటనే వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా దేవస్థానం సేవల వివరాలు లభిస్తాయి.
దర్శన టికెట్ కౌంటర్లు,ప్రసాదం కౌంటర్,అన్న ప్రసాదం,రవాణా సదుపాయాలు,ఆసుపత్రి,దివ్యాంగులకు సౌకర్యాలు,తాగునీరు,మరుగుదొడ్లు,కళ్యాణ కట్ట,సమాచారం కేంద్రం,పోలీస్ స్టేషన్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఉదాహరణకు 1 నుంచి 12 వరకు సూచిన సంఖ్యలను బట్టి మీకు కావాల్సిన నెంబర్ ను నమోదు చేస్తే సంబంధిత సమాచారం పొందవచ్చు. ఈ డిజిటల్ సేవల ద్వారా భక్తులకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు సులభమైన సమాచారాన్ని అందించడం దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతిక భాగస్వామిగా ఆత్రేయ ఇన్ఫోటెక్ సంస్థ సేవలను అందించింది.
చుట్టపక్కల ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వేములవాడకు భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చే భక్తులకు ఆలయ కార్యక్రమాలు, పూజా విధానాల గురించి ముందే అవగాహన ఉండటం వల్ల వారి యాత్ర మరింత సులభమవుతుందని అధికారులు చెబుతు్నారు.
ఇక ప్రస్తుతం రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా వేములవాడ భీమన్న గుడిలో కల్పిస్తున్న దర్శన, మొక్కుల సమాచారం ఇందులో అందుబాటులో ఉండటం విశేషం. మరోవైపు వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
{{/usCountry}}ఇక ప్రస్తుతం రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా వేములవాడ భీమన్న గుడిలో కల్పిస్తున్న దర్శన, మొక్కుల సమాచారం ఇందులో అందుబాటులో ఉండటం విశేషం. మరోవైపు వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
{{/usCountry}}