...
...
Next Story

Voter Enumeration : ఓటర్లు సహాయక పత్రాలను ఎప్పుడు సమర్పించాలి..? ఈ సమాచారం తెలుసుకోండి

ఓటర్ల నమోదు లేదా అర్హత నిర్ధారణ ప్రక్రియలో పత్రాల సమర్పణపై ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. సాధారణ ఓటర్ల గణన (Enumeration) దశలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని…. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సహాయక పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Published on: Jun 27, 2026, 20:43:17 IST
Advertisement

ఓటరు జాబితా నమోదు, సవరణల ప్రక్రియపై పౌరుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటన విడుదల చేశారు. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో లేదా వివరాల ధృవీకరణ కోసం ఏయే సందర్భాల్లో డాక్యుమెంట్లు సమర్పించాలో… ఎలాంటి పత్రాలు చెల్లుబాటు అవుతాయో క్షుణ్ణంగా వివరించారు.

పత్రాలు ఎప్పుడు అవసరం?

  • గణన దశ (Enumeration Phase) : ఓటర్ల గణన లేదా ప్రాథమిక గుర్తింపు ప్రక్రియ సాగుతున్నప్పుడు ఓటరు ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.
  • ప్రత్యేక నోటీసు జారీ చేసినప్పుడు : ముసాయిదా ఓటరు జాబితా (Draft Electoral Roll) ప్రచురించిన తర్వాత.. ఒకవేళ ఓటరు రిజిస్ట్రేషన్ అధికారి లేదా అసిస్టెంట్ ఓటరు రిజిస్ట్రేషన్ అధికారి సదరు వ్యక్తి యొక్క అర్హతపై ఏవైనా సందేహాలు వ్యక్తం చేస్తూ నోటీసు జారీ చేస్తే, అప్పుడు మాత్రమే ఓటరు తన అర్హతను నిరూపించుకోవడానికి సహాయక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

చెల్లుబాటు అయ్యే పత్రాలు (12 రకాలు):

ఓటర్లు సహాయక పత్రాలను ఎప్పుడు సమర్పించాలి..?
ఓటర్లు సహాయక పత్రాలను ఎప్పుడు సమర్పించాలి..?

అధికారులు నోటీసు ఇచ్చిన పక్షంలో…. ఓటర్లు తమ అర్హతను నిరూపించుకోవడానికి ఈ క్రింది 12 రకాల పత్రాలలో వేటినైనా సమర్పించవచ్చు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

  1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పీఎస్‌యూ (PSU)లు రెగ్యులర్ ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు జారీ చేసిన గుర్తింపు కార్డు/ పెన్షన్ పేమెంట్ ఆర్డర్.
  2. 01.07.1987 కంటే ముందు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీస్, ఎల్‌ఐసీ లేదా పీఎస్‌యూ ద్వారా భారతదేశంలో జారీ చేయబడిన గుర్తింపు కార్డు లేదా ఏదైనా ధృవీకరణ పత్రం.
  3. జనన ధృవీకరణ పత్రం.
  4. భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్.
  5. గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాలు జారీ చేసిన మెట్రిక్యులేషన్ / విద్యా సర్టిఫికెట్.
  6. రాష్ట్ర అధికార సంస్థ జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం.
  7. అటవీ హక్కుల చట్టం కింద లభించిన అటవీ హక్కుల పత్రం.
  8. సక్షమ అధికారి జారీ చేసిన OBC / SC / ST లేదా ఏదైనా కుల ధృవీకరణ పత్రం.
  9. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) పత్రాలు (అమల్లో ఉన్నచోట).
  10. రాష్ట్ర లేదా స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ .
  11. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి లేదా ఇళ్ల కేటాయింపు పత్రం.
  12. ఆధార్ కార్డు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe