...
...
Next Story

TG Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి..? ఇవిగో అప్డేట్స్

Telangana Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం జవాబు ప్రతాల మూల్యాంకనం కొనసాగుతోంది. అయితే ఇందుకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Published on: Mar 16, 2026, 15:13:59 IST
Advertisement

ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4 లక్షల మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

టీజీ ఇంటర్ పరీక్షలు
టీజీ ఇంటర్ పరీక్షలు

ప్రస్తుతం తెలంగాణ ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సంస్కృతం సబ్జెక్ట్ పేపర్ల మూల్యాంకనం పూర్తి అయింది. ఇక మిగిలిన పేపర్లను 3 విడతల్లో పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. మొదటి విడత మార్చి 15వ తేదీన ప్రారంభమైంది. రెండో విడత మార్చి 18వ తేదీన, మార్చి 20వ తేదీ నుంచి మూడో విడత ప్రారంభమవుతుంది.

ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పేపర్ వాల్యూయేషన్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ పరిశీలిస్తారు. ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి. ఈ ప్రక్రియ కూడా మార్చి 21వ తేదీలోపు పూర్తయ్యేలా ఇంటర్ బోర్డు కార్యాచరణను సిద్ధం చేసింది.

టీజీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు..?

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగానే…. సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. మార్కుల నమోదుతో పాటు ఇతర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియను మార్చి 31వ తేదీ నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఫలితాల ప్రాసెసింగ్‌కు టైమ్ తీసుకుంటారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని ఫలితాల విడుదల కోసం ఓ తేదీని ఖరారు చేస్తారు.

గతేడాదిలో చూస్తే… తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదలయ్యాయి. అయితే ఈసారి మాత్రం త్వరగానే ఫలితాలు అందుబాటులోకి వస్తాయి.

టీజీ ఇంటర్ ఫలితాలు ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

తెలంగాణ ఇంటర్ ఫలితాలు https://www.tgbie.in/index.html వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

  1. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
  2. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ విద్యార్థి హాల్‌టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్ కాపీని పొందాల్సి ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks