TG Inter Spot Valuation 2026 : 3 విడతల్లో ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ - ఇవిగో అప్డేట్స్

TG Inter Spot Valuation 2026 Updates : తెలంగాణ ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. సంస్కృతం పేపర్ వాల్యుయేషన్ పూర్తి కాగా... మిగతా సబ్జెక్టులను మొత్తం 3 విడతల్లో పూర్తి చేయనున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొనసాగనుంది.

Published on: Mar 9, 2026, 05:10:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలన్నీ మార్చి 18వ తేదీతో పూర్తవుతాయి. ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9,97,075 విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది, రెండో సంవత్సరంలో 5,07,949 మంది ఉన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

స్పాట్ వాల్యూయేషన్ (image istock)
స్పాట్ వాల్యూయేషన్ (image istock)

ఓవైపు పరీక్షలు కొనసాగుతుండగా… మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సంస్కృతం సబ్జెక్ట్ పేపర్ల మూల్యాంకనం పూర్తి అయింది. ఇక మిగిలిన పేపర్లను 3 విడతల్లో పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

మొదటి విడత (ప్రారంభం: 15-03-2026):

  • ఇంగ్లీష్ పేపర్ I & II
  • తెలుగు పేపర్ I & II
  • హిందీ పేపర్ I & II
  • గణితం పేపర్ I(A), I(B) & II(A), II(B)
  • రాజకీయ శాస్త్రం పేపర్ I & II

రెండో విడత (ప్రారంభం: 18-03-2026)

  • ఫిజిక్స్ పేపర్ I & II
  • ఎకానామిక్స్ పేపర్ I & II
  • కెమిస్ట్రీ పేపర్ I & II

మూడో విడత (ప్రారంభం: 20-03-2026)

  • బోటనీ పేపర్ I & II
  • జూలజీ పేపర్ I & II
  • కామర్స్ పేపర్ I & II
  • హిస్టరీ పేపర్ I & II

ఇక స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పేపర్ వాల్యూయేషన్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ పరిశీలిస్తారు. ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి. ఈ ప్రక్రియ కూడా మార్చి 21వ తేదీలోపు పూర్తయ్యేలా ఇంటర్ బోర్డు కార్యాచరణను సిద్ధం చేసింది.

త్వరితగతిన వాల్యూయేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ప్రతి జవాబు పత్రం క్షుణ్ణంగా పరిశీలించి… మార్కులను ఎంట్రీ చేస్తారు. ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూడాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. వాల్యూయేషన్ ప్రాసెస్ పూర్తి కాగానే… మార్కుల ఎంట్రీ, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. ఫలితాల విడుదలకు తేదీని ఖరారు చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More