TG Inter Exams 2026 : తెలంగాణ ఇంటర్ పరీక్షల అప్డేట్ - స్పాట్‌ వాల్యూయేషన్‌ ఎప్పట్నుంచో తెలుసా..?

TG Inter Spot Valuation 2026 : తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తి అవుతాయి. అయితే స్పాట్ వాల్యూయేషన్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మార్చి 3వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Published on: Feb 26, 2026, 05:11:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9,97,075 విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది, రెండో సంవత్సరంలో 5,07,949 మంది ఉన్నారు.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా… ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఓవైపు పరీక్షలు ప్రారంభం కాగా… మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఓ తేదీని కూడా డిసైడ్ చేశారు.

మార్చి 3 నుంచి వాల్యూయేషన్…!

ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ దిశగా ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సంస్కృతం సబ్జెక్ట్ పేపర్లతో మూల్యాంకనం ప్రాసెస్ షురూ కానుంది. ఆ తర్వాత 3 విడతల్లో మిగిలిన సబ్జెక్టుల పేపర్లను దిదే ప్రక్రియ కొనసాగుతుంది.

త్వరితగతిన వాల్యూయేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ప్రతి జవాబు పత్రం క్షుణ్ణంగా పరిశీలించి… మార్కులను ఎంట్రీ చేస్తారు. ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూడాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. వాల్యూయేషన్ ప్రాసెస్ పూర్తి కాగానే… మార్కుల ఎంట్రీ, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. ఫలితాల విడుదలకు తేదీని ఖరారు చేస్తారు.

టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026

  • 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
  • 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
  • 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
  • 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
  • 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:

  • 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
  • 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
  • 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
  • 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
  • 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
  • 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
  • 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2
  • 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More