ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా..? స్టేటస్ ఇలా తెలుసుకోండి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నడుస్తోంది. అయితే చాలా మంది ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొత్త మంది పేర్లకు ఆమోదం రాగా.. చాలా మందివి పరిశీలిస్తున్నారు. అయితే దరఖాస్తుదారులు వారి వివరాలను స్థానిక అధికారులను ఆశ్రయించి.. తెలుసుకోవచ్చు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఇప్పటికే పలువురికి కొత్త కార్డులు వస్తుండగా... మరికొందరి పేర్లను పాత కార్డుల్లోకి ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు పేర్ల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే చాలా మంది కొత్త కార్డుల కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనకార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా కూడా ఆఫ్ లైన్ ద్వారా సాగింది. అయితే దరఖాస్తుదారులు వారి స్టేటస్ వివరాలను తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత మీసేవాద్వారా అవకాశం కల్పించింది. మీసేవాలో అప్లికేషన్ చేసుకున్న వారికి అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దీనితో సులభంగా వారి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటున్నారు. కానీ ప్రజాపాలన(ఆఫ్ లైన్)లో దరఖాస్తులు చేసుకున్న వారికి మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు వారి వివరాలను తెలుసుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు.
స్టేటస్ ఎక్కడ తెలుసుకోవాలంటే..?
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు రేషన్కార్డుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి కార్డు మంజూరవుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు.... పంచాయతీ కార్యదర్శలను సంప్రదించవచ్చు. అక్కడ వివరణ తీసుకున్న తర్వాత.... ఏమైనా సందేహాలు ఉంటే స్థానికంగా ఉండే మండల అధికారులను సంప్రదిస్తే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుస్తుంది.
కొనసాగుతున్న వెరిఫికేషన్.....
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను ఆన్ లైన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆన్ లైన్ చేసిన వారి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఆన్ లైన్ ప్రక్రియంతా కూడా పంచాయతీ కార్యదర్శులు చూస్తున్నారు. ఆన్ లైన్ అయిన తర్వాత.... క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఆపై మండల స్థాయిలోతహసీల్దార్ లాగిన్ చేరుతుంది.
మండల స్థాయిలో ఆమోదం తెలపగానే జిల్లా పౌరసరఫరాల అధికారి లాగిన్‌కు చేరుతుంది. జిల్లా కలెక్టర్ ఆమోదంతో కార్డులు మంజూరు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ఇప్పటికప్పుడు ఈ ప్రక్రియ జరుగుతోంది. అఫ్రూవ్ అయిన వాటికి తదుపరి నెలలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం కేటాయిస్తున్నారు.
కొత్త కార్డు వివరాలను ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..
కొత్త రేషన్కార్డు పొందినవాళ్లు లేదా పాత కార్డులో పేర్లు నమోదైన వారు... వారి వివరాలను ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎఫ్ఎస్ సీ సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డు సెర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే FSC సెర్చ్ అనే ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేసి FSC Ref No నెంబర్ లేదా మీ రేషన్ కార్డు నెంబర్ ను ఎంట్రీ చేసి జిల్లాను ఎంచుకోవాల్లి. చివర్లో ఉండే సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ కార్డు వివరాలను కింద డిస్ ప్లే అవుతాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


