తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపా రెడ్డి (48) దారుణంగా హత్యకు గురయ్యారు. బుధవారం రోజున ఆమె నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యంత క్రూరంగా దాడి చేసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దేవరకొండ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP) ఎమ్.వి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. దాడి తీవ్రత అత్యంత ఘోరంగా ఉంది. రూపా రెడ్డి శరీరంపై సుమారు 27 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇంట్లోని నగదు గానీ, ఇతర విలువైన వస్తువులు గానీ మాయం కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో దొంగతనం కోసం జరిగిన హత్య కాదని, కేవలం కక్షలు లేదా తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అసలేం జరిగింది?
రూపా రెడ్డి తన భర్త రాజేందర్ రెడ్డితో కలిసి శనివారం నాడు హైదరాబాద్‌కు వెళ్లారు. వారి కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భర్తకు అక్కడ పని ఉండటంతో రూపా రెడ్డి మంగళవారం ఉదయం ఒక్కరే కొండమల్లేపల్లికి తిరిగి వచ్చి బడికి హాజరయ్యారు.
సాయంత్రం 5:30 గంటల వరకు పాఠశాలలోనే ఉన్న ఆమె కొందరు స్నేహితులు ఇంటికి వస్తున్నారు అని సహోద్యోగులకు చెప్పి ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం ఆమె పాఠశాలకు రాకపోవడం, భర్త రాజేందర్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం మొదలైంది.
భర్త చెప్పిన మేరకు వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు వెళ్లి చూడగా లోపల తలుపులు వేసి ఉన్నాయి. దీంతో రాజేందర్ రెడ్డి పక్క ఇంట్లోనే నివాసముంటున్న చింతపల్లి సబ్ఇన్స్పెక్టర్ రామ్మూర్తిని అద్దెవారు సంప్రదించారు. ఎస్ఐ పొరుగువారితో కలిసి ఇంటి వెనకాల వైపునకు వెళ్లి చూశారు. వెనకాల డోర్ తీసి ఉంది. రూపా రెడ్డి రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నారు.
{{/usCountry}}భర్త చెప్పిన మేరకు వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు వెళ్లి చూడగా లోపల తలుపులు వేసి ఉన్నాయి. దీంతో రాజేందర్ రెడ్డి పక్క ఇంట్లోనే నివాసముంటున్న చింతపల్లి సబ్ఇన్స్పెక్టర్ రామ్మూర్తిని అద్దెవారు సంప్రదించారు. ఎస్ఐ పొరుగువారితో కలిసి ఇంటి వెనకాల వైపునకు వెళ్లి చూశారు. వెనకాల డోర్ తీసి ఉంది. రూపా రెడ్డి రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నారు.
{{/usCountry}}సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. బాధితురాలి భర్త, కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి బాగా తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ తగాదాలు, వ్యక్తిగత విభేదాలతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.