ముగ్గురు పసిపిల్లల భవిష్యత్తును వెలుగులతో నింపాల్సిన ఆ తల్లి, తన అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నాడని భావించి, పచ్చని సంసారాన్ని కూల్చేసింది. చివరికి తాళి కట్టిన భర్తను వరసకు కొడుకయ్యే వ్యక్తితో కలిసిబలి తీసుకుంది. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో కలకలం రేపింది.

చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య(38), శారద దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు). కుటుంబ పోషణ కోసం పంతంగి గ్రామం వద్ద పొలం కౌలుకు తీసుకుని దానయ్య కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే శారద దారి తప్పి అక్రమ సంబంధం పెట్టుకుంది. సోషల్ మీడియాలో విభిన్న అకౌంట్లు నిర్వహిస్తూ, స్థానిక రాజకీయ నాయకులతో సహా పలువురితో సంబంధాలు నడిపిస్తోంది. గతంలోనూ ఆమె మరొకరితో వెళ్లిపోయి తిరిగి వచ్చినప్పటికీ, దానయ్య పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఆమెను మన్నించాడు.
అయితే ఇటీవల దానయ్య సొంత అన్న కుమారుడైన రాపోలు శివతో కూడా శారద పరిధి దాటి ప్రవర్తించింది. వరసకు కొడుకైన వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకోవడం గమనించిన దానయ్య, వారిద్దరినీ తీవ్రంగా మందలించాడు. దీంతో తమకు అడ్డు వస్తున్నాడని భావించి, బాబాయి అని కూడా చూడకుండా దానయ్యను హతమారుస్తానని శివ గతంలో బెదిరింపులకు దిగాడు.
ఆదివారం రోజు దానయ్య సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయనను వెళ్లకుండా అడ్డుకున్న శారద, పథకం ప్రకారం పొలం వద్దకు తీసుకెళ్లింది. అక్కడకు ప్రియుడు శివను పిలిపించుకుంది. శారద, శివను దానయ్య గమనించడంతో అక్కడ తీవ్ర ఘర్షణ జరిగింది. దానయ్యపై శివ దాడి చేయగా, కిందపడిపోయిన దానయ్య లేవకుండా భార్య శారదే ఆయన కాళ్లను గట్టిగా పట్టుకుంది. ఆ సమయంలో శివ బండరాళ్లతో విచక్షణారహితంగా కొట్టి దానయ్యను చంపేశాడు.
హత్య అనంతరం శారద ఏమీ ఎరుగనట్లు పక్క పొలంలో ఉన్న వారి వద్దకు వెళ్లి భర్త కనిపించడం లేదని నాటకమాడింది. అక్కడి ప్రజలు వెతకగా దానయ్య రక్తపు మడుగులో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శారద ప్రవర్తనపై అనుమానంతో విచారించగా ఆమె దారుణాన్ని ఒప్పుకుంది.
{{/usCountry}}హత్య అనంతరం శారద ఏమీ ఎరుగనట్లు పక్క పొలంలో ఉన్న వారి వద్దకు వెళ్లి భర్త కనిపించడం లేదని నాటకమాడింది. అక్కడి ప్రజలు వెతకగా దానయ్య రక్తపు మడుగులో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శారద ప్రవర్తనపై అనుమానంతో విచారించగా ఆమె దారుణాన్ని ఒప్పుకుంది.
{{/usCountry}}పరారైన ప్రియుడు శివ తన సెల్ ఫోన్లు, దుస్తులను గుండ్రాంపల్లి చెరువులో పడేశాడు. పోలీసులకు దొరకకూడదని పారిపోతుండగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.