సంసారాన్ని నాశనం చేసిన అక్రమ సంబంధం.. కొడుకు వరుసైన వ్యక్తితో కలిసి భర్త ప్రాణం తీసిన భార్య!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొడుకు వరుసైన వ్యక్తితో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను చంపేసినట్టుగా విచారణలో తేలింది.
ముగ్గురు పసిపిల్లల భవిష్యత్తును వెలుగులతో నింపాల్సిన ఆ తల్లి, తన అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నాడని భావించి, పచ్చని సంసారాన్ని కూల్చేసింది. చివరికి తాళి కట్టిన భర్తను వరసకు కొడుకయ్యే వ్యక్తితో కలిసిబలి తీసుకుంది. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో కలకలం రేపింది.

చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య(38), శారద దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు). కుటుంబ పోషణ కోసం పంతంగి గ్రామం వద్ద పొలం కౌలుకు తీసుకుని దానయ్య కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే శారద దారి తప్పి అక్రమ సంబంధం పెట్టుకుంది. సోషల్ మీడియాలో విభిన్న అకౌంట్లు నిర్వహిస్తూ, స్థానిక రాజకీయ నాయకులతో సహా పలువురితో సంబంధాలు నడిపిస్తోంది. గతంలోనూ ఆమె మరొకరితో వెళ్లిపోయి తిరిగి వచ్చినప్పటికీ, దానయ్య పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఆమెను మన్నించాడు.
అయితే ఇటీవల దానయ్య సొంత అన్న కుమారుడైన రాపోలు శివతో కూడా శారద పరిధి దాటి ప్రవర్తించింది. వరసకు కొడుకైన వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకోవడం గమనించిన దానయ్య, వారిద్దరినీ తీవ్రంగా మందలించాడు. దీంతో తమకు అడ్డు వస్తున్నాడని భావించి, బాబాయి అని కూడా చూడకుండా దానయ్యను హతమారుస్తానని శివ గతంలో బెదిరింపులకు దిగాడు.
ఆదివారం రోజు దానయ్య సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయనను వెళ్లకుండా అడ్డుకున్న శారద, పథకం ప్రకారం పొలం వద్దకు తీసుకెళ్లింది. అక్కడకు ప్రియుడు శివను పిలిపించుకుంది. శారద, శివను దానయ్య గమనించడంతో అక్కడ తీవ్ర ఘర్షణ జరిగింది. దానయ్యపై శివ దాడి చేయగా, కిందపడిపోయిన దానయ్య లేవకుండా భార్య శారదే ఆయన కాళ్లను గట్టిగా పట్టుకుంది. ఆ సమయంలో శివ బండరాళ్లతో విచక్షణారహితంగా కొట్టి దానయ్యను చంపేశాడు.
హత్య అనంతరం శారద ఏమీ ఎరుగనట్లు పక్క పొలంలో ఉన్న వారి వద్దకు వెళ్లి భర్త కనిపించడం లేదని నాటకమాడింది. అక్కడి ప్రజలు వెతకగా దానయ్య రక్తపు మడుగులో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శారద ప్రవర్తనపై అనుమానంతో విచారించగా ఆమె దారుణాన్ని ఒప్పుకుంది.
పరారైన ప్రియుడు శివ తన సెల్ ఫోన్లు, దుస్తులను గుండ్రాంపల్లి చెరువులో పడేశాడు. పోలీసులకు దొరకకూడదని పారిపోతుండగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


