వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం - అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య..! వెలుగులోకి అసలు విషయాలు

కూకట్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది.  వివాహేతర సంబంధం, జల్సాలకు అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. చున్నీతో ఉరివేసి చంపినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది.

Published on: Jan 21, 2026, 12:25:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. కొన్నిచోట్ల విడిపోవటాలు జరుగుతుండగా… మరికొన్ని వ్యవహారాల్లో ప్రాాణాలే పోతున్నాయి. కట్టుకున్న వారని కూడా చూడకుండా కడతేర్చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కూడా ఓ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో నిద్రపోతున్న భర్తను చున్నీతో ఉరేసి హత్య చేశారు. పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

కూకట్‌పల్లిలో దారుణం (representative image )
కూకట్‌పల్లిలో దారుణం (representative image )

భార్య భర్తలు అయిన సుధీర్ రెడ్డి, ప్రసన్న… కూకట్‌పల్లిలో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం అని తెలిసింది. ఈ విషయాన్ని భర్త గట్టిగా ప్రశ్నించటాన్ని భార్య ప్రసన్న తట్టుకోలేకపోయింది. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని చూసింది. అయితే భార్య తీరుపై కన్నేసి సుధీర్ రెడ్డి… ఓసారి పోలీసులను కూడా ఆశ్రయించాడు. తనను చంపేందుకు భార్య ప్రసన్న ప్రయత్నించిందని పేర్కొన్నాడు.

ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. కట్ చేస్తే… ఆ తర్వాతి వారం రోజుల్లోనే సుధీర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. గత నెల 24వ తేదీన సుధీర్ రెడ్డి మెడకు చున్నీ బిగించి భార్య ప్రసన్న చంపేసింది. అంతేకాదు… తనకేం తెలియదన్నట్లు డ్రామా షురూ చేసింది. కానీ సుధీర్ రెడ్డి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయగా…. సంచలన విషయా లు బయటపడ్డాయి.

సుధీర్ రెడ్డి మృతిపై అనుమానాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు… పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.ఈ క్రమంలోనే భార్య ప్రసన్నను తమదైన శైలిలో విచారించారు.తానే హత్య చేసినట్లు ప్రసన్న అంగీకరించింది. చున్నీతో అతడి మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు పేర్కొంది. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు… ఆమెను కోర్టులో హాజరుపర్చి సంగారెడ్డి జిల్లాలోని కంది జైలుకు తరలించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More