హైదరాబాద్‌లోని మియాపూర్‌లో అత్యంత కలకలం రేపిన ఓ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో.. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా అంతమొందించింది. ఆపై ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడింది. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ క్రూరమైన ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా బయటకొచ్చాయి.

పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ నెలలో తన భర్త కనిపించడం లేదంటూ సదరు మహిళ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నెలలు గడుస్తున్నా అతడి ఆచూకీ లభించకపోవడం, మహిళ ప్రవర్తనలో కొన్ని తేడాలు గమనించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
ఈ కేసులో ఎలాంటి క్లూ దొరకకపోవడంతో మియాపూర్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. బాధితుడితో పాటు అతడి భార్యకు సంబంధించిన కాల్ డేటా రికార్డులను (CDR) క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విచారణలో సదరు మహిళ ఓ నంబర్‌తో గంటల తరబడి, తరచూ మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి వివరాలు సేకరించి, ఆ కోణంలో విచారించడంతో అసలు నిజం బయటపడింది.
భార్య తన ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని పూడ్చిపెట్టి, తిరిగి హైదరాబాద్ వచ్చి ఏమీ ఎరుగనట్లు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
నిందితులిద్దరినీ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. వివాహేతర సంబంధం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
{{/usCountry}}నిందితులిద్దరినీ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. వివాహేతర సంబంధం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
{{/usCountry}}