'మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారా? అయితే మీ రేషన్ కార్డును కోల్పోయే ప్రమాదం ఉంది..' ఇప్పుడు తెలంగాణలోని చాలా గ్రామాల్లో ఇదే ప్రచారం జరుగుతోంది. లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో దీనిపై చర్చ నడుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని గ్రామాల్లో ఈ ఆందోళనకరమైన సందేశం ఎక్కువగా వైరల్ అవుతోంది.

'మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో(ITR) వార్షిక ఆదాయం ఆరు లక్షల రూపాయలకు పైగా చూపిస్తే, మీ రేషన్ కార్డు రద్దు కావొచ్చు.' అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. గ్రామ పరిపాలన అధికారులు(GPO)లు ఇంటింటికీ వెళ్లి, కార్డుదారుల నుండి డిక్లరేషన్లను సేకరించి, ఆదాయపు పన్ను రికార్డులను సరిచూస్తున్నారు. దీంతో ఈ భయం మరింతగా ఎక్కువైంది.
ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా ఉన్న.. రేషన్ కార్డులు ఎక్కడ తమ నుంచి జారిపోతాయో అనే భయంలో జనాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రేషన్ కార్డులో ఉన్నవారిలో ఒకరు ఆరు లక్షలపైనా సంపాదించినా.. రేషన్ కార్డు వెంటనే రద్దు చేస్తారనే ప్రచారాన్ని చేస్తున్నారు. జీపీఓలు కూడా అర్హతపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 30 వేలకుపైగా, సిద్దిపేట జిల్లాలో 14 వేలకుపైగా మందిపై ఈ విచారణ జరుగుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
చాలా మంది రుణాలు పొందడానికో, టీడీఎస్ రిఫండ్ కోసమో.. లేదా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేస్తారు. ఇప్పుడు అవే ఫైలింగ్‌లతో రేషన్ కార్డు రద్దు అవుతుందా అనే భయం నెలకొన్నది. రేషన్ కార్డు కేవంల బియ్యం కోసం మాత్రమే కాదు.. ఇందిరమ్మ ఇంటికి, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీవంటి పథకాలకు కూడా వర్తిస్తుంది.
ఇప్పుడు విచారణ పేరుతో తమ కార్డులను ఎక్కడ తొలగిస్తారోననే భయం ఊర్లలో చాలా మందిలో ఉంది. అయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో అవకతవకలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం.. పౌరసరఫరాల శాఖ ద్వారా ఏరివేత ప్రక్రియ కూడా గతంలో చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా తనిఖీలు చేస్తున్నారని కూడా కొందరి వాదన. అంటే కేవలం అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రేషన్ కార్డుల రద్దుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
{{/usCountry}}ఇప్పుడు విచారణ పేరుతో తమ కార్డులను ఎక్కడ తొలగిస్తారోననే భయం ఊర్లలో చాలా మందిలో ఉంది. అయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో అవకతవకలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం.. పౌరసరఫరాల శాఖ ద్వారా ఏరివేత ప్రక్రియ కూడా గతంలో చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా తనిఖీలు చేస్తున్నారని కూడా కొందరి వాదన. అంటే కేవలం అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రేషన్ కార్డుల రద్దుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
{{/usCountry}}