Rythu Bharosa : యాసంగికి రైతు భరోసా పైసలు రైతన్నల అకౌంట్లోకి వస్తాయా? లేదా?
ఓవైపు ఎల్ నినో ముప్పుతో అనుకున్నంత స్థాయిలో పంటల సాగులేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరతతో యాసంగికి రైతు భరోసా వస్తుందా లేదా అని రైతన్నలు చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆర్థిక హామీలను నెరవేర్చేందుకు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆశించిన స్థాయిలో రాబడులు రాకపోవడం, మరోవైపు ఎల్ నినో వాతావరణ ప్రభావం కారణంగా రైతులకు సహాయం అందించాల్సి రావడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.

వరి వంటి ఎక్కువ నీటి వినియోగం అయ్యే పంటలు వేయవద్దని రైతులకు సూచించిన నేపథ్యంలో నష్టాన్ని భర్తీ చేసేందుకు పరిహారం ఇవ్వడం లేదా రైతు భరోసా నిధులు విడుదల చేయడం ప్రభుత్వానికి అనివార్యమైంది.
ఎల్ నినో ప్రభావంతో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్న రైతులతో పాటు ఇతర వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.30,000 కోట్ల ప్రత్యేక నిధుల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రారంభంలో రూ.20,000 కోట్ల సహాయాన్ని అభ్యర్థించినప్పటికీ, రాబోయే వర్షాకాలం వరకు ఎల్ నినో తీవ్రత కొనసాగవచ్చనే అంచనాలతో ఆ మొత్తాన్ని మరో రూ.10,000 కోట్లు పెంచి మొత్తం రూ.30,000 కోట్లకు సవరించారు.
ఈ నిధుల ద్వారా ప్రత్యక్షంగా నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముందు రాబోయే నెలల్లో నిధుల సమీకరణ పెద్ద సవాలుగా మారింది. బడ్జెట్ అంచనాలకు తగ్గట్టుగా ఆదాయ వనరులు సమకూరడం లేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి మొత్తం ఆదాయం రూ.92,013 కోట్లుగా నమోదైంది. ఇది బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న రూ.2.41 లక్షల కోట్ల వార్షిక ఆదాయంలో చాలా తక్కువ. సెప్టెంబర్ చివరి నాటికి వచ్చిన ఆదాయంలో రూ.44,612 కోట్లు రుణాల రూపంలోనే సమకూరాయి. అక్టోబరులో సెక్యూరిటీల వేలం ద్వారా సేకరించిన నిధులతో కలిపి, మొత్తం అప్పుల భారం దాదాపు రూ.50,000 కోట్లకు చేరుకుంది.
వానకాలం సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జూలై మాసంలో 71.38 లక్షల మంది రైతులకు దాదాపు రూ.9,000 కోట్లను రైతు భరోసా రూపంలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. సాధారణంగా డిసెంబర్ చివరి నాటికి యాసంగి సీజన్ నిధుల విడుదల తేదీలను ప్రకటిస్తారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. రైతు భరోసా ఇస్తారా అనే ప్రశ్నలు కూడా చర్చలు నడుస్తున్నాయి.
ఎల్ నినో తీవ్రత వల్ల నిధుల లభ్యత తగ్గిపోవడం, నీటి కొరత ఆధారంగా రబీ సాగు చేపట్టవద్దని రైతులకు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. కేంద్రం ఇచ్చే సహాయం ఎంత ఉంటుంది? పంట మార్పిడి లేదా సాగు చేయని రైతులకు ఎంత పరిహారం చెల్లించాలి? అనే అంశాలపై స్పష్టత వచ్చాకే యాసంగి నిధుల విడుదలపై ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుండి లభించే పరిహార సహాయం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారనుంది.
అయితే ప్రభుత్వం మాత్రం యాసంగిలో పంటలు సాగు చేసినా.. చేయకపోయినా రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టుగా సమాచారం. ఎల్ నినో ముప్పుతో క్రాప్ హాలీడే అంటూ ప్రభుత్వమే ప్రకటనలు చేసింది. ఇలాంటి సమయంలో అన్నదాతలు అండగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నిధులు సమకూర్చుకోవడంపై కూడా ప్రభుత్వం దృష్టిపెడుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


