Hyderabad Crime : శంషాబాద్‌లో దారుణం - మహిళపై క్యాబ్‌ డ్రైవర్ లైంగిక వేధింపులు..! రూ. 60 వేల నగదుతో పరారీ

శంషాబాద్ వద్ద ఓ మహిళపై టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులకు దిగాడు. ఆమె వద్ద ఉన్న రూ.60 వేల నగదుతో పరారయ్యాడు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

Published on: Sep 28, 2026, 13:55:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

నల్గొండకు చెందిన ఓ వ్యాపారవేత్తపై టాక్సీ డ్రైవర్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను శారీరకంగా వేధించడమే కాకుండా…. ఆమె వద్ద ఉన్న రూ. 60 వేల నగదును ఎత్తుకెళ్లాడు. శంషాబాద్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మహిళపై టాక్సీ డ్రైవర్ వేధింపులు
మహిళపై టాక్సీ డ్రైవర్ వేధింపులు

టాక్సీ డ్రైవర్ వేధింపులు…

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నల్గొండ ప్రాంతంలో డిపార్ట్‌మెంటల్ స్టోర్ నడుపుతున్న నైని నందిని (38) అనే మహిళ, శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జడ్చర్ల వద్ద హైదరాబాద్ వెళ్లేందుకు ఒక టాక్సీ ఎక్కింది. ఆ సమయంలో ఆమె వద్ద వ్యాపారానికి సంబంధించిన రూ. 60,000 నగదు ఉంది.

కారు శంషాబాద్ చేరుకోగానే…. గచ్చిబౌలి వరకు రావడానికి అదనంగా రూ. 50 ఇవ్వాలని డ్రైవర్ కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. తుండుపల్లి టోల్‌గేట్ దాటిన తర్వాత…. ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులోని ఒక మెడ్‌ప్లస్ మెడికల్ షాప్ వద్ద మందులు కొనేందుకు డ్రైవర్ వాహనాన్ని నిలిపాడు. ఆ తర్వాత రాత్రి 8:30 గంటల సమయంలో కొత్వాల్‌గూడ సర్వీస్ రోడ్డు పక్కన కారును ఆపి, ఆమెను బలవంతంగా పట్టుకుని వేధించడానికి యత్నించాడు.

బాధితురాలు అప్రమత్తమై పెద్దగా కేకలు వేయడంతో… డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. వెంటనే ఆమెను అక్కడే రోడ్డుపై వదిలేసి, ఆమెకు చెందిన రూ. 60 వేల నగదుతో కారులో వేగంగా పరారయ్యాడు. డ్రైవర్ ముఖం తనకు గుర్తుందని, మళ్లీ చూస్తే కచ్చితంగా గుర్తుపట్టగలనని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

బాధితురాలు అందించిన ఫిర్యాదు మేరకు ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్ట్ పోలీసులు… బీఎన్ఎస్ (భారతీయ నస్యాయ సంహిత) సెక్షన్లు 74, 318(4), 303(2) ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More