కౌలు రైతులకు రుణాలు.. లోన్ పొందడానికి అర్హతలు, పూర్తి వివరాలు ఇవి!
ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణం మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ మెుదలుపెట్టింది.
కౌలు రైతులు కూడా తమకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలో కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణం పొందవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మెుదలు పెట్టింది ప్రభుత్వం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌లు) ద్వారా రుణాలు ఇవ్వనున్నారు.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకుని.. అధిక వడ్డీని చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారు కౌలు రైతులు. పంట సాగు పెట్టుబడి కోసం రూ.లక్ష వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులను మరింత ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా అందజేయనుంది.
మీ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి రుణాలను అందించనుంది ప్రభుత్వం. ప్రస్తుతం అధికారులు ఏపీ వ్యాప్తంగా కౌలు రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో అర్హులైన వారికి వెంటనే రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వం అందించే రుణాలు విత్తనాలకు, ఎరువులు, కూలీ ఖర్చులు వంటి ముఖ్యమైన వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ రుణాలు పొందడానికి కౌలు రైతులు సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు రైతు పత్రాలు, సహకార సంఘం పరిధిలో నివాసం ఉంటూ అందులో సభ్యత్వం ఉండాలి.
రుణం కోసం దరఖాస్తు చేసే రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలనే నిబంధన ఉంది. అసైన్డ్ భూములను సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారికి రుణాలు రావు. సొంత ఇల్లు ఉన్నవారికి రుణాల మంజూరు చేయడంలో ప్రాధాన్యత ఉంటుంది. లోన్ వచ్చిన తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు అసలు, వడ్డీని తిరిగి చెల్లించాలి.
వడ్డీ వ్యాపారుల బారి నుంచి కౌలు రైతులను రక్షించేందుకు అర్హులైనవారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కౌలు రైతులను అప్పుల సమస్య నుంచి బయటపడేయవచ్చు అని అనుకుంటోంది. ప్రస్తుతం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. వివరాల సేకరణ అయిన వెంటనే.. లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ మెుదలుపెడతారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


