Sign in

పంట అవశేషాలను తగులబెట్టకండి.. రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

పంట అవశేషాలను కాల్చకుండా ఉండాలని ఏపీ వ్యవసాయ శాఖ రైతులను కోరింది. కాల్చితే భూమి నాణ్యత దెబ్బతింటుందని తెలిపింది.

Published on: Dec 9, 2025, 15:15:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పంట అవశేషాలను కాల్చకుండా, వాటిని మట్టిలో కలపాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది. గత రెండు వారాలుగా ఖరీఫ్ వరి కోతలు కొనసాగుతున్నాయని, అయితే అనేక ప్రాంతాల్లో రైతులు కోత తర్వాత వరి గడ్డి, దుబ్బులకు నిప్పు పెడుతున్నారని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జీలానీ సమూన్ అన్నారు. ఇలా కాల్చడం ద్వారా నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తీవ్రమైన పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

'రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ఉండాలి. నేల సారాన్ని కాపాడటానికి అవశేషాలు భూమిలో కలపాలి.' అని ఒక అధికారిక పత్రికా ప్రకటనలో సమూన్ అన్నారు. రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతులతో కలిసి గడ్డి కాల్చడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బంది రైతులకు సలహా ఇవ్వడం, పర్యావరణపరంగా సురక్షితమైన పద్ధతులను ప్రోత్సహించాలని ఆదేశించారు.

అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ముఖ్యమైన పోషకాలు కోల్పోతాయని, నేలలోని సేంద్రీయ కార్బన్ తగ్గుతుందని, ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల నాశనం అవుతుందని వ్యవసాయ శాఖ తెలిపింది. తేమ నిలుపుకొనే సామర్థ్యం తగ్గుతుందని, నేల ఆమ్లత్వం పెరుగుతుందని, కాలుష్యం కారణంగా ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని రైతులను హెచ్చరించింది. పంట అవశేషాలను నేలలో కలపడం వల్ల అవసరమైన పోషకాలు భూమికి దొరుకుతాయి. నేల కార్బన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, తదుపరి పంటల దిగుబడిని పెంచుతుంది.

వ్యవసాయం, ఉద్యానవన అధికారులు అన్ని జిల్లాల్లో అవగాహన ప్రచారాలను ముమ్మరం చేయాలని, కొనసాగుతున్న పంటకోత కాలంలో రైతులు అవశేషాల విలీన పద్ధతులను అవలంబించేలా చూసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జీలానీ కోరారు. దీర్ఘకాలిక వ్యవసాయ స్థిరత్వానికి నేల ఆరోగ్యాన్ని కాపాడటం చాలా అవసరమని, వ్యవసాయ నిపుణులు జారీ చేసిన శాస్త్రీయ సిఫార్సులను రైతులు పాటించాలని సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More