ఆంధ్రప్రదేశ్‌లో అవయవ మార్పిడి చికిత్సలను పేదలకు ఉచితంగా, మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దశలవారీగా 12 ప్రభుత్వ ఆసుపత్రులను అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘జీవన్‌దాన్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అవయవ దాన దినోత్సవ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద రోగులు ఖరీదైన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, బోధనాసుపత్రుల్లోనే అధునాతన అవయవ మార్పిడి సేవలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అవయవ దానాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు. మొదటి విడతలో భాగంగా విశాఖపట్నం, పలాస, కర్నూలు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ బోధనాసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల సేవలను విస్తరించనున్నారు.
2028 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాలేయ మార్పిడి చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2030 నాటికి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రాష్ట్రంలో అవయవ మార్పిడి చికిత్సల అవసరం ఏటా పెరుగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 31 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మాత్రమే జరిగాయని, డిమాండ్‌కు తగినంతగా అవయవాలు లభించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 5,935 మంది రోగులు వివిధ అవయవాల కోసం నిరీక్షణ జాబితాలో ఉన్నారని తెలిపారు.
ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కుటుంబాలను అవయవ దానానికి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మరణానంతర అవయవ దాతల కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10,000 ఆర్థిక సాయాన్ని రూ.1 లక్షకు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోంది.
{{/usCountry}}ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కుటుంబాలను అవయవ దానానికి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మరణానంతర అవయవ దాతల కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10,000 ఆర్థిక సాయాన్ని రూ.1 లక్షకు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోంది.
{{/usCountry}}సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్, ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గాన్ డోనార్స్ అసోసియేషన్ ప్రతినిధులు దాతల కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అవయవ దానం చేసిన ప్రతి కుటుంబంలో ఒక అర్హులైన వ్యక్తికి కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనను త్వరలోనే పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో అవయవ, శరీర దానంపై అవగాహన కల్పించే అంశాలను చేర్చాలని ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా, మెరుగైన రీతిలో సంక్లిష్టమైన అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.