Save Punarvika : వావ్ రియల్లీ గ్రేట్.. చిట్టితల్లి కోసం కదిలిన లోకం.. రూ. 16 కోట్లు కలెక్ట్!

#SavePunarvika కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అయింది. 11 నెలల చిన్నారి ప్రాణం కాపాడేందుకు లోకం ఏకమైంది. రూ.16 కోట్ల ఫండ్ రైజింగ్ జరిగింది. నిజంగా అద్భుతమైన విషయం ఇది.

Updated on: Feb 26, 2026, 12:50:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మానవత్వం ఇంకా చాలా మందిలోనే ఉంది. అవసరమైనవారి గుండె తడిని అర్థం చేసుకునేవారు ఇంకా లోకంలో చాలా మందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న చిట్టితల్లి పునర్విక ఘటనే ఇందుకు ఉదాహరణ. సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలు ఏకమై.. పునర్వికకు పునర్జన్మను ప్రసాదించారనే చెప్పాలి. రూపాయి.. రెండు రూపాయలు కాదు.. ఏకంగా రూ.16 కోట్లను సమకూర్చారు. ఇది జరిగే పనేనా అనుకున్నవారంతా ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. పునర్విక ఇంజక్షన్ కోసం రూ.16 కోట్లు సమకూరినట్టుగా తాజాగా పాప తండ్రి సురేష్ కుమార్ వెల్లడించారు. డబ్బులు ఇక ఎవరూ కలెక్ట్ చేయెుద్దని కోరారు.

పునర్విక (PR.writings/Facebook)
పునర్విక (PR.writings/Facebook)

కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన పదకొండు నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను సోషల్ మీడియా కాపాడింది. ఆమె వెన్నెముక కండరాల క్షీణత (SMA టైప్-1) అనే అరుదైన, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది. ఇది క్రమంగా కండరాల క్షీణతకు దారితీస్తుంది.

16 కోట్ల రూపాయల విలువైన చికిత్స అవసరం అని వైద్యులు సిఫార్సు చేశారు. కానీ ఆ పాప ఫ్యామిలీ అంత డబ్బు పెట్టుకునే స్థితిలో లేదు. రెక్కాడితేనే డొక్కా నిండేలా వారి జీవితాలు ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా తన పాపను బ్రతికించుకునేందుకు తండ్రి సురేష్ ప్రయత్నం మెుదలుపెట్టాడు.

'నేను సెలూన్ షాప్ ద్వారా జీవనోపాధి పొందుతున్నాను. నాకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. నా కూతురి పేరు పునర్విక. ఆమె గర్భంలో ఉన్నప్పుడు వైద్యులు సమస్యలను గుర్తించారు. ప్రసవం వరకు వేచి ఉండి పరిస్థితిని అంచనా వేయాలని మేం నిర్ణయించుకున్నాం. తరువాత ఇది చాలా ఖరీదైన చికిత్స అని తెలిసింది. చాలా అరుదైన వ్యాధి. అందుకే నేను దాతల సహాయం కోసం విజ్ఞప్తి చేశాను.' అని సురేష్ చెప్పారు.

ఆ కుటుంబం పడుతున్న బాధను చూసిన సోషల్ మీడియా సమాజం.. వెంటనే స్పందించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఫండ్ రైజింగ్‌కు సాయం చేశారు. సోషల్ మీడియా ప్రచారాల ద్వారా విరాళాలు అందించారు. రూ. 10 కోట్లకు పైగా సేకరించారు. మిగిలిన ఆరు కోట్లు కావాలని సురేష్ ఎక్స్ వేదికంగా మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూ.10 కోట్లు సేకరించినట్టుగా, వేలాది మంది ప్రజల దాతృత్వానికి వందనం చేస్తున్నానని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఆమెకు రూ. 6 కోట్ల బ్యాలెన్స్ వచ్చేలా చూసుకోవడం నా వంతు అని హామీ ఇచ్చారు. దీనితో పాప చికిత్స కోసం రూ.16 కోట్లు కలెక్ట్ అయ్యాయి.

ధులను సమీకరించడంతో చికిత్స ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని వైద్యులు ఇప్పుడు చెప్పారు. మరో మూడు నాలుగు రోజుల్లో పాప హెల్త్‌పై అప్డేట్ రానుంది. అంతకుముందు నటుడు మంచు మనోజ్ కూడా తన సపోర్ట్ అందించాడు. కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు.

నంద్యాల ఎంపీ మరియు లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కూడా వారికి మెుదటి నుంచి సాయంగా ఉంటూ వచ్చారు. బొమ్మలసత్రంలోని ఆమె కార్యాలయంలో ప్రజా దర్బార్ సందర్భంగా సహాయం కోరుతూ తనను సంప్రదించారని ఎంపీ చెప్పారు.

'పునర్విక చికిత్స కోసం సాయం చేసిన దాతలకు HT Telugu తరఫున కృతజ్ఞతలు'

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More