విశాఖపట్నం పరిధిలోని దువ్వాడ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణించే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ వేళలను మారుస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నూతన వేళలు 2026 నవంబర్ 14వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి.
చర్లపల్లి - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం. 18528)

పాత సమయం ప్రకారం.. ఇదివరకు ఈ రైలు ఉదయం 04:35 గంటలకు వచ్చి, 04:37 గంటలకు బయలుదేరేది. కొత్తగా దువ్వాడ స్టేషన్‌కు ఉదయం 04:23 గంటలకు చేరుకుని, 04:25 గంటలకు బయలుదేరుతుంది.
పోడనూర్ - ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం. 16619)
పాత టైమింగ్స్ ప్రకారం.. గతంలో ఈ రైలు ఉదయం 04:43 గంటలకు వచ్చి, 04:45 గంటలకు బయలుదేరేది. కొత్త సమయం ప్రకారం.. దువ్వాడ స్టేషన్‌కు ఉదయం 04:38 గంటలకు చేరుకుని, 04:40 గంటలకు బయలుదేరుతుంది.
ప్రయాణికులకు రైల్వే శాఖ సూచనలు
దువ్వాడ స్టేషన్ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఈ సమయ మార్పులను గమనించి, తమ ప్రయాణ ప్రణాళికలను దానికి అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు. రైలు ప్రయాణ సమయాలలో చివరి నిమిషంలో ఎటువంటి ఇబ్బందులు లేదా అయోమయం కలగకుండా ఉండేందుకు ప్రయాణికులు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) యాప్ ద్వారా గానీ లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 కి కాల్ చేసి తాజా సమయాలను సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు రద్దు
విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలును (రైలు సంఖ్య 04159/04160) రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
{{/usCountry}}విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలును (రైలు సంఖ్య 04159/04160) రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
{{/usCountry}}ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నేరుగా రాకపోకలు సాగించే కీలక రైలు సర్వీసు కావడంతో ఈ నిర్ణయం నిత్య ప్రయాణికులు, యాత్రికులు, విద్యార్థుల ప్రయాణ ప్రణాళికలను దెబ్బతీసింది. సుమారు 1,350 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణించే ఈ రైలు అందుబాటులో లేకపోవడంతో, ప్రయాణికులు విజయవాడ, హౌరా లేదా బిలాస్‌పూర్ వంటి రద్దీగా ఉండే జంక్షన్ల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. సాధారణంగా 27 గంటల్లో పూర్తయ్యే ప్రయాణ సమయం, ఈ ప్రత్యామ్నాయ మార్గాల వల్ల మరింత ఆలస్యమవుతోంది.
పండుగల సీజన్ సమీపిస్తుండటంతో రైల్వే అధికారులను ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రైలును పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ సమస్య తీవ్రతపై స్పందించిన దక్షిణ కోస్తా రైల్వే ఉన్నతాధికారులు, ప్రజా ఫిర్యాదులను రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు నగరాల మధ్య త్వరలోనే క్రమబద్ధమైన రైలు సర్వీసును పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రయాగ్‌రాజ్-విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ వారపు ప్రత్యేక రైలు సర్వీసులను రద్దు చేయడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహణాపరమైన కారణాల వల్ల ఈ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సర్వీసు అనేక ముఖ్యమైన స్టేషన్లను కలుపుతూ సుదూర మార్గం ద్వారా విశాఖపట్నాన్ని ప్రయాగ్‌రాజ్‌తో కలుపుతుంది. ఈ రద్దుల కాలంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రైళ్లు, ప్రయాణ మార్గాలను వెతుక్కోవాల్సి రావచ్చు.