AP Teachers Finland Tour : ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుత సేవలు అందించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 29 మంది ఉపాధ్యాయులను అంతర్జాతీయ వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమం (International Professional Development Programme) కోసం శనివారం ఫిన్‌లాండ్‌కు పంపుతోంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ బోధనా పద్ధతులకు పేరుగాంచిన ఫిన్‌లాండ్ విద్యా విధానాన్ని నేరుగా అధ్యయనం చేసేందుకు, ఆధునిక బోధనా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ పర్యటన ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడనుంది.
ఫిన్‌లాండ్‌లోని ప్రముఖ 'యూనివర్సిటీ ఆఫ్ తుర్కు' (University of Turku) తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మన ఉపాధ్యాయులు తుర్కు , రౌమా (Rauma) ప్రాంతాలను సందర్శిస్తారు.
అక్కడ ఉన్న ప్రాథమిక విద్యా కేంద్రాలు (Early Childhood Education Centres), ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలలను పరిశీలించి, అక్కడి తరగతి గదుల్లో బోధనా విధానాలను నేరుగా గమనిస్తారు. విదేశీ విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు జరిపి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు.
శిక్షణ ప్రధాన ఉద్దేశాలు:
- ప్రాథమిక విద్యలో పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా బోధించే విధానాలపై పట్టు సాధించడం.
- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సాధనాలను తరగతి గది బోధనలో సమర్థవంతంగా ఉపయోగించడం.
- ఉపాధ్యాయుల్లో పాఠశాల నిర్వహణ, మార్గదర్శకత్వ నైపుణ్యాలను పెంచడం.
- విద్యార్థుల మానసిక వికాసం, ఆరోగ్యం మరియు ఆనందకర వాతావరణంలో విద్యనభ్యసించేలా పాఠశాల సంస్కృతిని తీర్చిదిద్దడం.
ఫిన్లాండ్ విద్యా విధానం నుంచి నేర్చుకున్న విషయాల ఆధారంగా ఉపాధ్యాయులు తమ సొంత పాఠశాలలకు ఉపయోగపడే ప్రత్యేక ప్రాజెక్టులను రూపొందిస్తారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని తమ పాఠశాలల్లో అమలు చేస్తారు. అంతేకాకుండా…. ఈ 29 మంది ఉపాధ్యాయులు జిల్లా, మండల స్థాయిల్లోని తోటి ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్లుగా, మెంటార్లుగా వ్యవహరిస్తారు. ఫిన్‌లాండ్‌లోని ఉత్తమ అంశాలను మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్చి ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను కొనియాడారు. "మన సమాజానికి బలమైన పునాది ఉపాధ్యాయులే. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పాలు వారు. కేవలం విద్యార్థుల భవిష్యత్తునే కాకుండా, మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే శక్తి ఉపాధ్యాయులకు ఉంది" అని పేర్కొన్నారు.
{{/usCountry}}ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను కొనియాడారు. "మన సమాజానికి బలమైన పునాది ఉపాధ్యాయులే. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పాలు వారు. కేవలం విద్యార్థుల భవిష్యత్తునే కాకుండా, మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే శక్తి ఉపాధ్యాయులకు ఉంది" అని పేర్కొన్నారు.
{{/usCountry}}"మన ఉపాధ్యాయులకు సరైన జ్ఞానం, అధునాతన నైపుణ్యాలు మరియు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించడం ఎంతో అత్యవసరం. ఈ అంతర్జాతీయ శిక్షణా అవకాశం ద్వారా మన ఉపాధ్యాయులు ఫిన్‌లాండ్ నుంచి కొత్త ఆలోచనలు, అత్యుత్తమ బోధనా పద్ధతులను నేర్చుకుని వచ్చి, మన ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నాను" అని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.