వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మరో వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 15 నుంచి 16 మంది భారతీయులు మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయుల బృందం ఈ ప్రమాదానికి గురైంది. ఒక మొబైల్ ట్రేడింగ్ కంపెనీ స్పాన్సర్ చేసిన ఈ విహారయాత్రలో భాగంగా పర్యాటకులు ఒక దీవిని సందర్శించేందుకు వెళ్లారు. అయితే…. వాతావరణం అనుకూలించకపోవడం, అదే సమయంలో బోటుకు సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు.
"ఒక బాధాకరమైన ఘటన వియత్నాంలో జరిగింది. ఒక మొబైల్ ట్రేడింగ్ సంస్థ పంపిన పర్యటనలో భాగంగా భారత దేశం నుంచి చాలా మంది పర్యాటకులు వియత్నాం వెళ్లారు. వారు ఒక ద్వీపాన్ని సందర్శించే క్రమంలో వాతావరణం క్షీణించి, బోటులో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ప్రమాదం జరిగింది," అని మంత్రి శ్రీనివాస్ వివరించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బోటులో సుమారు 250 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అందులో పలువురు నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో సుమారు 15 నుంచి 16 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఇది అత్యంత విచారకరమని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాదాపు 33 మంది ఈ పర్యటనలో ఉండగా…. వారిలో ముగ్గురు మృతి చెందారని, మరొకరు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వ స్పందన
ప్రమాదం గురించి వార్తలు తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, "నారా లోకేశ్ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సమాచారం అందించారు. దీనిపై భారత ఎంబసీ, వియత్నాం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు" అని చెప్పారు.
{{/usCountry}}ప్రమాదం గురించి వార్తలు తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, "నారా లోకేశ్ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సమాచారం అందించారు. దీనిపై భారత ఎంబసీ, వియత్నాం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు" అని చెప్పారు.
{{/usCountry}}వియత్నాం అధికారులు కూడా ఈ ప్రమాదంపై చాలా వేగంగా స్పందించారని మంత్రి ప్రశంసించారు. వారు వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దించి, భారతీయ పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి…. ప్రమాదం నుంచి బయటపడిన వారిని, మరణించిన వారి భౌతిక కాయాలను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని హామీ ఇచ్చారు.
భారత్ నుంచి వియత్నాం వెళ్లిన పర్యాటకుల బృందంలో ఇంకా ఎంతమంది క్షేమంగా ఉన్నారు, వారిని ఎలా తరలించాలనే అంశాలపై భారత రాయబార కార్యాలయం వియత్నాం అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది.