చిత్తూరు జిల్లా నగరి మండలంలో మంగళవారం ఉదయం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాడుకుపేట సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక వాహనం తిరుచానూరు నుండి తిరుత్తణికి వెళుతుంది. మరొకటి చెన్నై నుండి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్‌గా గుర్తించారు.
రోడ్డు ప్రమాదం
{{^htLoading}} {{/htLoading}}
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో శంకర్, సంతానం పోటు(వంటగది) కార్మికులుగా పనిచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. గాయపడిన ముగ్గురు వ్యక్తులు తమిళనాడుకు చెందినవారని తెలిసింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పాఠశాల బస్సు బోల్తా
తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. తాటిపర్రులోని జ్యోతి స్కూల్‌కు చెందిన 25 మంది విద్యార్థులు బస్సులో వెళ్తున్నారు. బస్సు అదుపుతప్పడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. పాఠశాల సమయానికి విద్యార్థులను వేగంగా తీసుకెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. అకస్మాత్తుగా బ్రేకులు విఫలం అవ్వడమే కారణంగా తెలిసింది. లోపల ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన కారణంగా ఒక్కసారిగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి స్థానికులు వచ్చారు. సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో పది మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడానికి నిర్వహణ లోపమే కారణా అని కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పిల్లలు ప్రయాణించే వాహనాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.