2026-27 విద్యా సంవత్సరానికి గాను.. ఏపీ వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) 6 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాల ప్రాసెస్ నడుస్తోంది. అలాగే 7, 8, 9, 10, 12వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీని ఏప్రిల్ 10 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ) తెలిపారు.

వాస్తవానికి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 1తో ముగియాల్సి ఉంది. అయితే తల్లిదండ్రుల అభ్యర్థనల మేరకు చివరి తేదీని పొడిగించినట్లు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వర్గాలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశాల కోసం కేవలం ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులను https://apkgbv.apcfss.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపికైన విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. అలాగే ఎంపికైన విద్యార్థుల జాబితాను సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తారు. ఏవైనా సందేహాలు ఉంటే, విద్యార్థులు, తల్లిదండ్రులు పని వేళల్లో (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) 7993329115, 7075039990 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆరో తరగతితో పాటు ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా 7 నుంచి పదో తరగతి వరకు ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని గుర్తుచుకోవాలి. ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి 5వ తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీటు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి.. టెన్త్ పాసై ఉండాలి.
దరఖాస్తు ఫారాలు apkgbv.apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో పంపిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎంపికైన బాలికలకు ఫోన్ ద్వారా సందేశాలు అందుతాయి. పేర్లు సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డులలో కూడా ప్రదర్శిస్తారు.
{{/usCountry}}దరఖాస్తు ఫారాలు apkgbv.apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో పంపిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎంపికైన బాలికలకు ఫోన్ ద్వారా సందేశాలు అందుతాయి. పేర్లు సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డులలో కూడా ప్రదర్శిస్తారు.
{{/usCountry}}ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించరు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కేజీబీవీల్లో సీట్ల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13వ తేదీన విడుదల చేస్తారు. ఏప్రిల్ 13 నుంచి 17వ తేదీ వరకు ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఆ తర్వాత సీటును కన్ఫార్మ్ చేస్తారు.