Trains Cancelled : 'అర్నబ్‌' తుఫాన్‌ ఎఫెక్ట్... ఏపీ పరిధిలో 53 రైళ్లు రద్దు, పూర్తి జాబితా ఇదే

Arnab Cyclone Train Cancellations : అర్నబ్ తుపాన్ ధాటికి ప్రయాణికుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 27, 28 తేదీల్లో 53 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. విశాఖ, విజయవాడ, కాకినాడ మార్గాల్లో పలు రైళ్ల సేవలు నిలిచిపోయాయి.

Published on: Oct 27, 2026, 08:36:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Arnab Cyclone Train Cancellations : అర్నబ్ తుపాన్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. తుపాను తీవ్రత వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల మధ్య నడిచే రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించాల్సిన మొత్తం 53 ప్రయాణీకుల, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

తుఫాన్ ఎఫెక్ట్ - పలు రైళ్లు రద్దు
తుఫాన్ ఎఫెక్ట్ - పలు రైళ్లు రద్దు

ఈ నిర్ణయంతో ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ పోర్టు, పార్వతీపురం, నరసాపురం, మచిలీపట్నం, భీమవరం, గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది.

తుఫాన్ తీవ్రత దృష్ట్యా రెండు రోజుల పాటు పూర్తిగా రద్దు చేసిన రైళ్ల వివరాలను దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. వీటిలో 67261 రాజమండ్రి – విజయవాడ, 67263 విజయవాడ – మచిలీపట్నం, 67264 మచిలీపట్నం – విజయవాడ, 67265 విజయవాడ – మచిలీపట్నం రైళ్లు ఉన్నాయి. అలాగే 67271 మచిలీపట్నం – గుడివాడ, 67272 గుడివాడ – మచిలీపట్నం, 67252 మచిలీపట్నం – గుడివాడ, 67253 గుడివాడ – మచిలీపట్నం, 67254 మచిలీపట్నం – గుడివాడ, 67255 గుడివాడ – మచిలీపట్నం, 67256 మచిలీపట్నం – విజయవాడ రైళ్లను కూడా నిలిపివేశారు.

ఇక సుదూర ప్రాంతాల సర్వీసుల్లో 17267 కాకినాడ పోర్టు – విశాఖపట్నం, 17268 విశాఖపట్నం – కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు 07267 పార్వతీపురం – విశాఖపట్నం, 07268 విశాఖపట్నం – పార్వతీపురం రైళ్లను సైతం ఈ రెండు రోజులు రద్దు చేశారు.

ఇవాళ రద్దయిన రైళ్లు :

సోమవారం (అక్టోబర్ 27) నడవాల్సిన 67258 విజయవాడ – నరసాపురం, 67246 నరసాపురం – రాజమండ్రి, 17269 విజయవాడ – నరసాపురం, 17264 నరసాపురం – భీమవరం జంక్షన్, 67257 విజయవాడ – నరసాపురం, 17257 విజయవాడ – కాకినాడ పోర్టు, 67202 విజయవాడ – రాజమండ్రి రైళ్లు రద్దయ్యాయి.

వీటితో పాటు 67267 విజయవాడ – మచిలీపట్నం, 67247 నరసాపురం – గుంటూరు జంక్షన్, 67276 నరసాపురం – విజయవాడ, 67301 రాజమండ్రి – కాకినాడ పోర్టు, 67285 రాజమండ్రి – విశాఖపట్నం, 67286 విశాఖపట్నం – రాజమండ్రి రైళ్లు కూడా నిలిచిపోయాయి.

అక్టోబర్ 28న రద్దయిన రైళ్లు:

మంగళవారం (అక్టోబర్ 28) రోజున 67266 మచిలీపట్నం – విజయవాడ, 67275 విజయవాడ – భీమవరం జంక్షన్, 67277 భీమవరం జంక్షన్ – నిడదవోలు జంక్షన్, 67278 నిడదవోలు జంక్షన్ – భీమవరం జంక్షన్, 67244 నరసాపురం – నిడదవోలు జంక్షన్, 67245 నిడదవోలు జంక్షన్ – నరసాపురం, 17270 నరసాపురం – విజయవాడ రైళ్లు రద్దయ్యాయి.

అలాగే 67268 మచిలీపట్నం – విజయవాడ, 67249 గుంటూరు జంక్షన్ – రేపల్లె, 67250 రేపల్లె – గుంటూరు జంక్షన్, 67248 గుంటూరు జంక్షన్ – విజయవాడ, 67269 విజయవాడ – మచిలీపట్నం, 67270 మచిలీపట్నం – విజయవాడ, 67281 విజయవాడ – భీమవరం జంక్షన్, 67283 భీమవరం జంక్షన్ – నిడదవోలు జంక్షన్, 67284 నిడదవోలు జంక్షన్ – భీమవరం జంక్షన్, 67282 భీమవరం జంక్షన్ – విజయవాడ సర్వీసులను రద్దు చేశారు.

వీటితో పాటు 67262 విజయవాడ – రాజమండ్రి, 67302 కాకినాడ పోర్టు – రాజమండ్రి, 17258 కాకినాడ పోర్టు – విజయవాడ, 67229 విజయవాడ – గుంటూరు జంక్షన్, 67223 గుంటూరు జంక్షన్ – రేపల్లె, 67224 రేపల్లె – తెనాలి జంక్షన్, 67222 తెనాలి జంక్షన్ – విజయవాడ, 67251 భీమవరం జంక్షన్ – మచిలీపట్నం రైళ్లు కూడా నడవవని అధికారులు స్పష్టం చేశారు.

ప్రయాణాలు చేయాలని భావిస్తున్న ప్రజలు ముందుగా తమ రైలు నంబర్, ప్రయాణ తేదీని సరిచూసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందే అధికారిక విచారణ కేంద్రాలు (139 హెల్ప్‌లైన్) లేదా నేషనల్ ట్రైన్ ఎన్‌క్వైరీ సిస్టమ్ (NTES) యాప్ ద్వారా రైళ్ల తాజా సమాచారాన్ని నిష్పాక్షికంగా నిర్ధారించుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More