...
...
Next Story

ఏపీలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లు.. మీ జిల్లా ఏ జోన్‌లో ఉందో చూడండి?

ఆంధ్రప్రదేశ్‌ను 6 జోన్లుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి గెజిట్ కూడా జారీ చేసింది. ఇందులో 3 జోన్లు ఒక మల్టీ జోన్‌లో, మరో 3 జోన్లు మరో మల్టీ జోన్‌లో ఉంటాయి.

Published on: Dec 17, 2025, 15:36:37 IST
Advertisement

1975 పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికత, జోనల్ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆర్డర్‌‌కు సంబంధించినది. ఇందులో కేంద్రం మార్పులు చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలను ఆరు జోన్లుగా విభజించింది.

ఏపీలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లు
ఏపీలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లు

ఈ ఆరు జోన్లను రెండు మల్టీ జోన్లుగా విభజన చేసింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 3 జోన్లు ఒక మల్టీ జోన్‌లో, మరో 3 జోన్లు మరో మల్టీ జోన్‌లో ఉంటాయి ఈ సవరణతో ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక కేడర్, జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ మీద స్పష్టత వచ్చినట్టైంది. ఇక మీద ఒకే చోట ఏడు సంవత్సరాలు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా పరిగణిస్తారు.

మల్టీజోన్ 1

జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి.

జోన్-2: అల్లూరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ.

జోన్-3: పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్.

మల్టీ జోన్ 2

జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు.

జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప.

జోన్-6 : కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి.

ఈ కొత్త జోనల్ వ్యవస్థతో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు మరింత ప్రాధాన్యం దక్కుతుంది. రాష్ట్రంలో ఉద్యోగాల పంపిణీ సమానంగా జరగనుంది. స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్న నిబంధనల ప్రకారం నియామకాలు జరగనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe