పట్టణ రవాణాకు ప్రోత్సాహకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) త్వరలో పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. దీని ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం, పట్టణ వాయు నాణ్యతను మెరుగుపరచడం, ప్రజా రవాణా సేవలను ఆధునీకరించడం లక్ష్యం.

పినాకిల్ ఇండియా అనే సంస్థ ఈ బస్సులను నడపనుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఎంపిక చేసిన ఆపరేటర్‌కు ఇప్పటికే లెటర్ ఆఫ్ అవార్డు (LoA) జారీ చేశారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను త్వరగా ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయిందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. త్వరలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, క్లీన్ మొబిలిటీ సొల్యూషన్స్‌ను అవలంబిస్తున్న ప్రముఖ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ను స్థానం సంపాదించుకుంటుందని భావిస్తున్నారు.
ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) అనుబంధ సంస్థ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించింది. సీఈఎస్ఎల్ ఇటీవల PM E-DRIVE (పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్) పథకం కింద 10,900 ఎలక్ట్రిక్ బస్సుల కోసం భారతదేశంలో అతిపెద్ద మెగా టెండర్‌ను ముగించింది.
సీఈఎస్ఎల్ అంచనాల ప్రకారం, ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం వల్ల డీజిల్‌తో నడిచే బస్సులను మార్చడం ద్వారా నాలుగు మిలియన్ టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత, శబ్ద తగ్గింపు, మొత్తం జీవన నాణ్యతలో మెరుగుదల కనిపిస్తుంది.
సీఈఎస్ఎల్, ఈఈఎస్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అఖిలేష్ కుమార్ దీక్షిత్ కేంద్ర భారీ పరిశ్రమలు, విద్యుత్ మంత్రిత్వ శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు. 2070 నాటికి భారతదేశం ప్రజా రవాణాను ఆధునీకరించడంలో సహాయపడుతుందని అన్నారు.
{{/usCountry}}సీఈఎస్ఎల్, ఈఈఎస్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అఖిలేష్ కుమార్ దీక్షిత్ కేంద్ర భారీ పరిశ్రమలు, విద్యుత్ మంత్రిత్వ శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు. 2070 నాటికి భారతదేశం ప్రజా రవాణాను ఆధునీకరించడంలో సహాయపడుతుందని అన్నారు.
{{/usCountry}}PM E-DRIVE పథకం కింద, దేశవ్యాప్తంగా మొత్తం 14,028 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు అయ్యాయి. ప్రధాన నగరాలు, రాష్ట్ర రవాణా సంస్థలను కవర్ చేసేలా 10,900 బస్సులకు మొదటి దశలో టెండర్లు జారీ అయ్యాయి.