ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ద్వారా విడుదలయ్యే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకోవడానికి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) తప్పనిసరి. అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యా అర్హతల వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు APPSC అధికారిక యూజర్ గైడ్‌ను అందుబాటులో ఉంచింది. కొత్తగా నమోదు చేసుకునే అభ్యర్థుల కోసం సులభమైన పద్ధతిలో ఓటీపీఆర్ ప్రాసెస్ వివరాలు మీకోసం అందిస్తున్నాం.
న్యూ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?

ముందుగా APPSC అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో కనిపిస్తున్న One Time Profile Registration ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీరు నేరుగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తుంటే Direct Recruitment కేటగిరీ కింద ఉన్న ‘New Registration’ లింక్‌పై క్లిక్ చేయాలి. (ప్రభుత్వ ఉద్యోగులు/డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లు రాసేవారు వాటికి సంబంధించిన ప్రత్యేక న్యూ రిజిస్ట్రేషన్ లింక్‌ను ఎంచుకోవాలి).
న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో అడిగిన అన్ని వివరాలను కచ్చితత్వంతో భర్తీ చేయాలి. (పేరు, లింగం, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, మాతృభాష, కులం, మతం, గుర్తింపు గుర్తులు. ఇతర వివరాలు: దివ్యాంగులా (SADAREM), ఎక్స్-సర్వీస్‌మెన్, లేదా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. చిరునామా వివరాలు: ప్రస్తుత మరియు శాశ్వత చిరునామా.)
విద్యా అర్హతలు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న రకం (రెగ్యులర్/ప్రైవేట్/ఓపెన్ స్కూలింగ్) వివరాలు నమోదు చేయాలి. అలాగే 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర వివరాల హాల్ టికెట్ నంబర్లు, మార్కుల శాతం, పాసైన సంవత్సరం భర్తీ చేయాలి.
స్పష్టమైన పాస్‌పోర్ట్ సైజు ఫోటో (గరిష్టంగా 50 KB, JPEG), సంతకం (గరిష్టంగా 30 KB, JPEG) నిర్దేశిత పరిమాణంలో అప్లోడ్ చేయాలి.
{{/usCountry}}స్పష్టమైన పాస్‌పోర్ట్ సైజు ఫోటో (గరిష్టంగా 50 KB, JPEG), సంతకం (గరిష్టంగా 30 KB, JPEG) నిర్దేశిత పరిమాణంలో అప్లోడ్ చేయాలి.
{{/usCountry}}మొత్తం పూర్తి చేసిన తర్వాత డిక్లరేషన్ అంగీకరించి ‘Preview’ బటన్‌పై క్లిక్ చేయాలి. వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకున్న తర్వాత, స్క్రీన్‌పై కనిపిస్తున్న క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి ‘Submit’ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీకి ప్రత్యేకమైన OTPR రెఫరెన్స్ ఐడీ వస్తుంది.
భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు రసీదును ‘Download Receipt’ లేదా ‘Print’ ఆప్షన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రెఫరెన్స్ ఐడీ వచ్చిన తర్వాత APPSC హోమ్ పేజీకి వెళ్లి ‘Login’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కొత్త వినియోగదారులు ‘Sign Up’ పై క్లిక్ చేసి తమ OTPR ID, మొబైల్ నంబర్ నమోదు చేసి ‘Get OTP’ క్లిక్ చేయాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ‘Validate OTP’ క్లిక్ చేయాలి.
కొత్త పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లో కనీసం ఒక క్యాపిటల్ లెటర్, ఒక సంఖ్య, ఒక ప్రత్యేక గుర్తు ఉండాలి.
తప్పుగా నమోదు చేసిన వివరాలను సవరించుకోవడానికి APPSC వెబ్‌సైట్‌లో ‘Modify One Time Profile Registration’ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా మీరు వ్యక్తిగత వివరాలు, ఫోటో/సంతకం లేదా ఇతర వివరాలు (చిరునామా, విద్యా అర్హతలు) లోగిన్ అయి సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.