...
...
Next Story

Tirumala : తిరుమల శ్రీవారికి బంగారు పగడాల హారాలు విరాళం

హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీమతి కమల గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలను కానుకగా అందించారు. TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వీటిని అందజేశారు.

Published on: Oct 8, 2026, 13:56:42 IST
Advertisement

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిత్య కైంకర్యాలు, ఆభరణాల సమర్పణలో భక్తులు తమ భక్తిప్రపత్తులను చాటుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే(ఇవాళ) గురువారం రోజు శ్రీవారికి ఒక అపూర్వమైన విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి కమల అనే భక్తురాలు స్వామివారికి దాదాపు రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలను కానుకగా సమర్పించారు.

టీటీడీ అధికారులకు అప్పగింత..

శ్రీవారికి బంగారు పగడాల హారాలు విరాళం
శ్రీవారికి బంగారు పగడాల హారాలు విరాళం

తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసిన కమల…. శ్రీవారి ఆలయంలోని ప్రసిద్ధ రంగనాయకుల మండపంలో ఈ కానుకలను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

అత్యంత సుందరంగా రూపొందించిన ఈ రెండు బంగారు పగడాల హారాలను స్వీకరించిన అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, దాత కుటుంబ సభ్యులకు స్వామివారి వేద ఆశీర్వచనం అందించేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి…. వారి భక్తిశ్రద్ధలను అభినందించారు.

తిరుమల శ్రీవారికి రోజువారీగా దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు నగదు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులను కానుకలుగా సమర్పిస్తుంటారు. గురువారం రోజు సమర్పించిన ఈ పగడాల హారాలు శ్రీవారి ఆభరణాల జాబితాలో ప్రత్యేకాకర్షణగా నిలవనున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks