అగ్రికల్చరల్ కాలేజీలో టీచింగ్ అసోసియేట్ నోటిఫికేషన్.. జీతం 60వేల పైనే!
శ్రీకాకుళం జిల్లా నైరాలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని అగ్రికల్చరల్ కాలేజీలో ఖాళీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. అర్హత గల అభ్యర్థులను ఇంటర్వ్యూ దారా ఎంపిక చేస్తారు.
శ్రీకాకుళం జిల్లా నైరాలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని అగ్రికల్చరల్ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థుల జనవరి 27న హాజరు కావాల్సి ఉంటుంది.

అర్హతల విషయానికొస్తే.. బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా కావాలి. పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, నేరా, అగ్రికల్చర్ కాలేజ్‌లో 27-01-2026న ఇంటర్వ్యూ ఉంటుంది.
ఈ పోస్టు కోసం వచ్చేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పూర్తిగా తాత్కాలిక, కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులవుతారు. రెగ్యులర్ సిబ్బందిని భర్తీ చేసిన తర్వాత రద్దు చేస్తారు. విశ్వవిద్యాలయం/ఏదైనా ప్రభుత్వ సంస్థలో ఏదైనా రెగ్యులర్ నియామకం కోసం క్లెయిమ్ చేసుకునే హక్కును కలిగి ఉండరు.
ఉద్యోగి ఎటువంటి క్లెయిమ్ (లేదా) ఒప్పంద సేవను కొనసాగించడానికి ఎటువంటి హక్కును కలిగి ఉండరు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు.. వాస్తవాలను దాచిపెట్టడం లేదా ఏ రూపంలోనైనా మోసానికి పాల్పడితే.. ఒప్పంద ఉద్యోగిని తొలగిస్తారు. ముందస్తు నోటీసు లేకుండా లేదా ఏదైనా కారణం చూపకుండా ఎప్పుడైనా ఒప్పంద ఉద్యోగి నియామకాలను రద్దు చేయవచ్చు.
ఉద్యోగి నియామకం పొందిన వ్యక్తులు ఒక నెల నోటీసు పిరియడ్ ఇవ్వడం ద్వారా స్వయంగా ఒప్పంద సేవను వదిలివేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు నియామకానికి ముందు వారి శారీరక దృఢత్వాన్ని నిర్ధారించుకోవడానికి నిబంధనల ప్రకారం వారి స్వంత ఖర్చులతో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ ఇవ్వరు. పై పోస్ట్ కోసం ఎంపిక అనేది కమిటీదే తుది నిర్ణయం ఉంటుంది.
జీతం విషయానికొస్తే.. మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి నెలకు రూ. 61,000 ప్లస్ వర్తించే ఇంటి అద్దె భత్యం (HRA). అదే పీహెచ్.డీ డిగ్రీ ఉన్నవారికి నెలకు రూ. 67,000 ప్లస్ వర్తించే ఇంటి అద్దె భత్యం (HRA) అందిస్తారు.

E-Paper












