...
...
Next Story

Bhogapuram Airport : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 30 నిమిషాలకో ఏరో ఎక్స్‌ప్రెస్ బస్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతీ 30 నిమిషాలకో ఏరో ఎక్స్‌ప్రెస్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఉదయం 4:55 గంటలకు ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి

Published on: Aug 17, 2026, 15:15:48 IST
Advertisement

విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 30 నిమిషాలకు ఒక 'ఏరో ఎక్స్‌ప్రెస్' ఏసీ బస్సు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారి ఆర్‌ఎమ్‌బీ అప్పలనాయుడు వెల్లడించారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్
భోగాపురం ఎయిర్‌పోర్ట్

మొదటి ఏరో ఎక్స్‌ప్రెస్ సర్వీస్ పాత గాజువాక నుంచి ఉదయం 04:55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ బస్సు ఎయిర్‌పోర్ట్ మీదుగా మద్దిలపాలెం వైపు ప్రయాణిస్తుంది. ఇదే రూట్‌లో చివరి బస్సు సేవ రాత్రి 07:45 గంటలకు బయలుదేరుతుంది. రోజంతా ప్రతి 30 నిమిషాలకు ఒక ఏరో ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు అందుబాటు ధరల్లోనే ఈ సేవలను అందిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఛార్జీలు కింది విధంగా ఉన్నాయి.

పాత గాజువాక : రూ. 400

గురుద్వార్ : రూ. 300

జూ పార్క్ : రూ. 250

మధురవాడ / మారీకవలస : రూ. 150

తగరపువలస : రూ. 100

ఈ ఏరో ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సుల సీట్లను ప్రయాణికులు ముందస్తుగా APSRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా ఆర్టీసీ కౌంటర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. అలాగే బస్సులోనే కండక్టర్ వద్ద నేరుగా టికెట్ పొందే వెసులుబాటు ఉంది. విమాన ప్రయాణికుల వద్ద ఉండే పెద్ద లగేజ్ బ్యాగులను సురక్షితంగా ఉంచేందుకు ఈ ప్రత్యేక ఏసీ బస్సులలో విశాలమైన లగేజ్ స్పేస్‌ను ఏర్పాటు చేశారు.

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం (ఆగస్టు 17) పౌర విమాన రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో సంస్థకు చెందిన తొలి విమానం ఈ రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని తొలి విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను అందజేసి వారి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe