Air India Express Bird Strike : ఆకాశంలో విమాన ప్రయాణాల్లో వరుస ఆందోళనకర ఘటనలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు పయనమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి గాల్లో పక్షి తగలడం తీవ్ర కలకలం రేపింది.
బెంగళూరులో ల్యాండింగ్..!

ఈ ఘటనలో పైలట్ల సమయస్ఫూర్తితో విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి విమానంలో ఉన్న 148 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ నుంచి బెంగళూరు బయలుదేరిన IX2065 నంబరు గల ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గమ్యస్థానానికి చేరుకోగానే…. ముందు జాగ్రత్త చర్యగా పార్కింగ్ స్టాండ్‌కు తరలించారు. ప్రామాణిక భద్రతా నిబంధనల ప్రకారం గ్రౌండ్ ఇంజినీర్లు, సాంకేతిక బృందాలు విమానం రెక్కలు, ఇంజన్, ప్రధాన భాగాలు ఏమైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో సమగ్ర తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు అధికారికంగా నిర్ధారించారు.
మరొక ఘటనలో…. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా AI-2030 విమానం హైజాక్ భయంతో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో చట్టవిరుద్ధమైన జోక్యం లేదా హైజాకింగ్ ముప్పును సూచించే అంతర్జాతీయ అత్యవసర కోడ్ 'Squawk 7500'ను పైలట్లు ప్రసారం చేయడంతో భద్రతా దళాలు తీవ్రంగా అప్రమత్తమయ్యాయి. ఉదయం 09:35 గంటల ప్రాంతంలో జైపూర్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
అనంతరం ఏరోడ్రోమ్ కమిటీ, భద్రతా ఏజెన్సీలు విమానంలో అంగుళం అంగుళం తనిఖీలు చేసి ఎలాంటి ముప్పు లేదని తేల్చాయి. పూర్తి భద్రతా తనిఖీల అనంతరం, విమానానికి క్లియరెన్స్ ఇవ్వడంతో అది తిరిగి ఢిల్లీకి బయలుదేరింది.
{{/usCountry}}అనంతరం ఏరోడ్రోమ్ కమిటీ, భద్రతా ఏజెన్సీలు విమానంలో అంగుళం అంగుళం తనిఖీలు చేసి ఎలాంటి ముప్పు లేదని తేల్చాయి. పూర్తి భద్రతా తనిఖీల అనంతరం, విమానానికి క్లియరెన్స్ ఇవ్వడంతో అది తిరిగి ఢిల్లీకి బయలుదేరింది.
{{/usCountry}}