ఏపీ మున్సిపల్ ఎన్నికలు - రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్

ఏపీలో  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికలు జరిగే అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోదుకాణాలు బంద్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Published on: Oct 19, 2026, 08:43:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల సమరానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మున్సిపల్ ఎన్నికలు - రెండ్రోజుల పాటు మద్యం షాపులు బంద్
మున్సిపల్ ఎన్నికలు - రెండ్రోజుల పాటు మద్యం షాపులు బంద్

2 రోజులు షాపులు మూసివేత…

పోలింగ్‌కు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు ఉండవు. ఈ మేరకు రెండు రోజుల పాటు మద్యం షాపులు ఏవీ తెరవకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏవైనా ఎన్నికలు జరిగే సమయంలో ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు అధికారులు మూసివేస్తారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించినా లేదా దొంగచాటుగా మద్యం విక్రయాలు జరిపినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. అక్రమ మద్యం రవాణా, నిల్వలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా గస్తీని పెంచి, ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసు శాఖతో కలిసి ఎక్సైజ్ యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మద్యం షాపులన్నీ మూతపడనున్నాయి. సాధారణ వైన్ షాపులతో పాటు క్లబ్‌లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్ల వంటివన్నీ కూడా క్లోజ్ అవుతాయి.

మరోవైపు ఆదివారంతో మేయర్, మున్సిపల్‌ ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్‌ స్థానాలకు నామినేషన్లు ముగిశాయి. మొత్తం 3 రోజుల్లో కలిపి మేయర్‌ స్థానాలకు మొత్తం 330, మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు 1,038 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేటర్‌ స్థానాలకు 8,198, కౌన్సిలర్‌ స్థానాలకు 16,253 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా మూడు రోజుల్లో అన్నింటికీ కలిపి 25,819 నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్ల పునఃపరిశీలన (స్క్రూట్నీ), 21న ఉపసంహరణల అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More