Air India Express Bird Strike : విశాఖ నుంచి వెళ్తున్న విమానాన్ని ఢీ కొట్టిన పక్షి - బెంగళూరులో ల్యాండింగ్..!

Air India Express Bird Strike : విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పక్షి తగిలింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో 148 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.

Published on: Oct 20, 2026, 15:43:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Air India Express Bird Strike : ఆకాశంలో విమాన ప్రయాణాల్లో వరుస ఆందోళనకర ఘటనలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు పయనమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి గాల్లో పక్షి తగలడం తీవ్ర కలకలం రేపింది.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం(ఫైల్ ఫొటో)
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం(ఫైల్ ఫొటో)

బెంగళూరులో ల్యాండింగ్..!

ఈ ఘటనలో పైలట్ల సమయస్ఫూర్తితో విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి విమానంలో ఉన్న 148 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖ నుంచి బెంగళూరు బయలుదేరిన IX2065 నంబరు గల ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గమ్యస్థానానికి చేరుకోగానే…. ముందు జాగ్రత్త చర్యగా పార్కింగ్ స్టాండ్‌కు తరలించారు. ప్రామాణిక భద్రతా నిబంధనల ప్రకారం గ్రౌండ్ ఇంజినీర్లు, సాంకేతిక బృందాలు విమానం రెక్కలు, ఇంజన్, ప్రధాన భాగాలు ఏమైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో సమగ్ర తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు అధికారికంగా నిర్ధారించారు.

మరొక ఘటనలో…. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా AI-2030 విమానం హైజాక్ భయంతో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో చట్టవిరుద్ధమైన జోక్యం లేదా హైజాకింగ్ ముప్పును సూచించే అంతర్జాతీయ అత్యవసర కోడ్ 'Squawk 7500'ను పైలట్లు ప్రసారం చేయడంతో భద్రతా దళాలు తీవ్రంగా అప్రమత్తమయ్యాయి. ఉదయం 09:35 గంటల ప్రాంతంలో జైపూర్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

అనంతరం ఏరోడ్రోమ్ కమిటీ, భద్రతా ఏజెన్సీలు విమానంలో అంగుళం అంగుళం తనిఖీలు చేసి ఎలాంటి ముప్పు లేదని తేల్చాయి. పూర్తి భద్రతా తనిఖీల అనంతరం, విమానానికి క్లియరెన్స్ ఇవ్వడంతో అది తిరిగి ఢిల్లీకి బయలుదేరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More