భోగాపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు విమానాలు.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల
భోగపురం విమానాశ్రయం ఆగస్టు 17 నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలకు విమాన సర్వీసులు నడపనుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా తన విమాన షెడ్యూల్‌ను ప్రకటించింది. అంతర్జాతీయ సర్వీసులు కూడా నడవనున్నాయి.
భోగపురం విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ఆగస్టు 17న ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా అక్టోబర్ 24 వరకు తన విమాన షెడ్యూల్‌ను ప్రకటించింది. హైదరాబాద్-భోగపురం మధ్య ప్రతిరోజూ ఐదు సర్వీసులను, బెంగళూరు-భోగపురం మధ్య ప్రతిరోజూ రెండు సర్వీసులను నడపనుంది. దీంతోపాటుగా అదనంగా వారంలో ఐదు రోజులు (ఆదివారాలు, శుక్రవారాలు మినహా) ఒక సర్వీసును నడుపుతామని ఆ విమానయాన సంస్థ పేర్కొంది. విజయవాడ, భోగపురం మధ్య ప్రతిరోజూ నాలుగు సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్టు గేమ్ ఛేంజర్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు, ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర
అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల సంక్షేమం,ఆర్థికాభివృద్ధి, ఉపాధి,రవాణా,పర్యాటకం, సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడే అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మూడు లక్షలకు పైగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రజల రాకపోకలకు ఇప్పటికే సుమారు 5–6 వేల బస్సులను ఏర్పాటు చేశామని, ప్రజా ప్రతినిధులు కూడా తమ సొంత వాహనాలతో పాటు మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేతులమీదుగా రూ. 17,900 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం కానున్నాయన్నారు. ప్రధాన మంత్రి భోగాపురం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కార్యక్రమ ఏర్పాట్లపై ప్రతిరోజూ రెండుసార్లు సమీక్షిస్తూ, అధికారులు, ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేస్తున్నారని చెప్పారు. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం నగరాల్లో సుమారు 200 హోర్డింగ్స్,50 ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 5 డ్రోన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాధాన్యత, ఉత్తరాంధ్రకు రానున్న అభివృద్ధి అవకాశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి పార్థసారథి వివరించారు.
విమానాశ్రయంతో ఎగుమతులకు కొత్త ఊపు లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో 25,000 మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యం కలిగిన టెర్మినల్ అందుబాటు లోకి రావడంతో ఉత్తరాంధ్ర నుంచి దేశ,విదేశాలకు ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.ఈ విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక,సామాజిక, వాణిజ్య రంగాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు,దేశాలకు వలస వెళ్లే ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర,భవిష్యత్తులో ఇతర ప్రాంతాల వారికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగు తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.విమానాశ్రయం ద్వారా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడి,యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


