...
...
Next Story

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి-విశాఖ స్పెషల్ ట్రైన్.. ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు!

రైలు ప్రయాణికలకు రైల్వే శాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. తిరుపతి-విశాఖ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడుపుతోంది. మరోవైపు పలు రైళ్లను రద్దు చేసినట్టుగా ప్రకటించింది.

Published on: Oct 20, 2026, 09:03:44 IST
Advertisement

రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. పలు సాంకేతిక, నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని షార్ట్ టెర్మినేషన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక వన్-వే ట్రైన్‌ను నడుపుతున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు పలు సర్వీసులు పూర్తిగా అందుబాటులో ఉండవు. రైలు నంబర్ 18515 విశాఖపట్నం – కిరండూల్ ఎక్స్‌ప్రెస్, రైలు నంబర్ 18516 కిరండూల్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ క్యాన్సిల్ అయ్యాయి.

షార్ట్ టెర్మినేషన్ / షార్ట్ ఆరిజినేషన్ అయిన రైళ్లు చూసుకుంటే.. రైలు నంబర్ 18447 భువనేశ్వర్ – జగదల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 21 నుండి 28 వరకు ఈ రైలు జగదల్‌పూర్ వరకు వెళ్లకుండా కొరాపుట్ వద్దకే వెళ్తుంది.

రైలు నంబర్ 18448 జగదల్‌పూర్ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 22 నుండి 29 వరకు ఈ రైలు జగదల్‌పూర్‌కు బదులుగా కొరాపుట్ నుంచే తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

రైలు నంబర్ 58501 విశాఖపట్నం – కిరండూల్ ప్యాసింజర్ అక్టోబర్ 21 నుండి 28 వరకు విశాఖ నుండి బయలుదేరే ఈ రైలు కొరాపుట్ వరకే నడుస్తుంది.

రైలు నంబర్ 58502 కిరండూల్ – విశాఖపట్నం ప్యాసింజర్ అక్టోబర్ 21 నుండి 28 వరకు కిరండూల్‌కు బదులుగా కొరాపుట్ నుంచే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు సౌత్ కోస్ట్ రైల్వే ఒక ప్రత్యేకం వన్-వే స్పెషల్ రైలును నడుపుతోంది. రైలు నంబర్ 07423 (తిరుపతి – విశాఖపట్నం) అక్టోబర్ 20న తిరుపతిలో ఉదయం 9:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు బుధవారం ఉదయం 06:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

గుంతకల్ మీదుగా ప్రయాణించే ఈ రైలు రేణిగుంట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ధోన్, బెతంచెర్ల, నంద్యాల, దిగువమెట్ట, మార్కాపూర్ రోడ్, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

3ఏ (6), 2ఏ (2), స్లీపర్ (8), జనరల్ సిట్టింగ్ (4), జనరల్ సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్ (2) ఉంటాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks