...
...
Next Story

డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీ దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో డిసెంబరు 11 నుంచి 15 వరకు భవానీ దీక్షా మాల విరమణ ఉండనుంది. ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

Updated on: Dec 10, 2025, 22:02:32 IST
Advertisement

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో భవానీలు గురువారం అంటే డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు దీక్షను విరమించనున్నారు. ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాల నుండి భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. భద్రతను కోసం, అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి, సజావుగా దర్శనం, కదలికను సులభతరం చేయడానికి సమగ్ర బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

విజయవాడ దుర్మమ్మ గుడి
విజయవాడ దుర్మమ్మ గుడి

ఐదు రోజులుపాటు కొనసాగనున్న భవానీ దీక్ష విరమణకు సుమారు 7 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. ఇరుముడి సమర్పించేందుకు మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు, వెయిటింగ్ హాల్స్, అదనపు పార్కింగ్‌తోపాటుగా 19 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు అయ్యాయి.

భద్రతా ప్రణాళికను 12 భాగాలు, 71 సెక్టార్‌లుగా విభజించారు. 4,129 మంది పోలీసు అధికారులు, ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్, ఇతర జిల్లాల నుండి సిబ్బందిని మోహరించారు. బయటి జిల్లాల నుండి వచ్చే సిబ్బందికి వసతి ఏర్పాటు చేశారు.

బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమన్వయ, బ్రీఫింగ్ సమావేశం జరిగింది. ఇక్కడ భద్రతా ప్రోటోకాల్‌లు, శాఖాపరమైన మార్గదర్శకాలు, జనసమూహ నిర్వహణ చర్యలపై డిప్యూటెడ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. గిరిప్రదక్షిణ మార్గం, హోల్డింగ్ ప్రాంతాలు, స్నాన ఘాట్‌లు, పార్కింగ్ జోన్‌లు, ఇతర సున్నితమైన ప్రదేశాల గురించి అధికారులకు వివరించడానికి డ్రోన్ ఫుటేజ్‌ను ఉపయోగించారు.

భక్తుల పట్ల మర్యాదగా, సానుభూతితో ఉండాలని, ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాలని, మతపరమైన భావాలను గౌరవించాలని ఎస్పీ రాజశేఖర్ బాబు అధికారులకు సూచించారు. జనసమూహ ప్రవాహాన్ని నిశితంగా పర్యవేక్షించాలని, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని, సీనియర్ అధికారులకు వెంటనే సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడం, వాహనాలు, పాదచారుల సజావుగా కదలికపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe