దీక్షలో డ్యూటీ చేయకూడదు.. సెలవులు తీసుకోవాలి : పోలీస్ శాఖ కీలక ఆదేశాలు
మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
మతరపమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మతపరమైన దీక్షలు తీసుకుంటే.. సెలవులు తీసుకోవాలని, డ్యూటీలో ఉండగా దీక్షలు చేయడానికి వీలు లేదని వెల్లడించింది. ఇందులో భాగంగా ఓ ఎస్సైకి మెమో కూడా జారీ చేశారు.

అయ్యప్ప దీక్షకు నల్లటి దుస్తులు ధరించడంతోపాటు జుట్టు, గడ్డం పెంచుకున్నందుకు సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) కే.శ్రీకాంత్.. కాంచన్‌బాగ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎస్.కృష్ణకాంత్‌కు మెమో జారీ చేశారు. ఏడీసీపీ చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియమం ఒక నిర్దిష్ట సమాజానికి మాత్రమే వర్తిస్తుందో లేదో రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలుసుకోవాలని కోరారు. 'మన పండుగల సమయంలో, ఎవరైనా దీక్ష చేస్తున్నప్పుడు పోలీసు శాఖ అనవసరమైన నిబంధనలను ఎందుకు జారీ చేస్తోంది? ఒక నియమం అందరికీ వర్తించాలి. ఒక సమాజం ఆధారంగా ఉండకూడదు.' అని రాజాసింగ్ ప్రశ్నించారు.
అయితే పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు జుట్టు, గడ్డం పెంచుకోవడానికి, బూట్లు లేకుండా సివిల్ డ్రెస్ ధరించడానికి అనుమతి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు శ్రీకాంత్ ఆ మెమోలో పేర్కొన్నారు. 'ఏదైనా పోలీసు సిబ్బంది దీక్ష చేపట్టాలనుకుంటే వారు సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన కార్యాలయ మెమోను సూచిస్తూ, మీ దరఖాస్తును అనుకూలంగా పరిగణించలేం.' అని ఆయన జోన్‌లోని అసిస్టెంట్ కమిషనర్లు (ACPలు), స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOలు)కు ఒక కాపీని పంపారు.
దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విశ్వ హిందూ పరిషత్ (VHP) తెలంగాణ యూనిట్ కూడా ADCP సబ్-ఇన్‌స్పెక్టర్‌కు జారీ చేసిన మెమోను తీవ్రంగా పరిగణించింది. ADCPపై అవసరమైన చర్య తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కోరింది. 'దీక్ష పాటించినందుకు సబ్-ఇన్‌స్పెక్టర్‌కు మెమో జారీ చేయడం హిందూ వ్యతిరేకం.' అని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి రావినూతల శశిధర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


