AP Assembly Sessions : రేపట్నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు - వైసీపీ హాజరుకానుందా..? ఈసారి స్ట్రాటజీ ఏంటి..?
Andhra Pradesh Assembly Sessions : ఆంధ్రప్రదేశ్ చట్టసభల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాల వివరాలు, సభలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధం చేసిన వ్యూహాల సమగ్ర సమాచారం.
Andhra Pradesh Assembly Sessions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సోమవారం (ఆగస్టు 17) నుంచి చట్టసభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

అమరావతిలోని వెలగపూడి వద్ద గల అసెంబ్లీ భవనంలో సోమవారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక శాసనమండలి భవనంలో ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు కొలువుదీరనున్నాయని రాజ్ భవన్ జారీ చేసిన ప్రకటనలో అధికారులు వెల్లడించారు. ఈ రాబోయే సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవలనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు సభ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు రాబోతున్నారా..?
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను చట్టసభల వేదికగా ఎండగట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఆగస్టు 12న నిర్వహించిన సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పూర్తి డేటాతో సభకు వచ్చి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సభలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నప్పటికీ, తమకు 'ప్రతిపక్ష నేత' హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిరాకరిస్తోందని జగన్ తీవ్రంగా ఆరోపించారు. విపక్షం గొంతు నొక్కేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని, అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులను మీడియా ద్వారా ప్రజలకు నిరంతరం వివరిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాల్లో చోటుచేసుకున్నాయంటున్న అక్రమాలు, ఔట్‌సోర్సింగ్ నియామకాల స్కామ్‌లు, ఇతర ప్రజా సమస్యలపై సభలో తీవ్రంగా నిలదీయాలని జగన్ తమ శాసనసభ్యులను ఆదేశించారు. ఈ అంశాలపై చర్చకు పట్టుబట్టాలని దిశా నిర్దేశం చేశారు.
అలాగే రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర (MSP) లభించడం లేదని, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేయడం వల్ల రైతాంగం మరింత నష్టపోయిందని, ఈ సమస్యలను సభలో గట్టిగా వినిపించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ
శాసనసభలో తమ పార్టీ సభ్యులు కొద్దిమందే ఉన్నప్పటికీ… శాసనమండలిలో వైఎస్‌ఆర్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉందనే విషయాన్ని జగన్ గుర్తుచేశారు. ప్రజల గొంతుకగా మారి ప్రతి సమస్యను మండలి వేదికగా గట్టిగా లేవనెత్తాలని ఎమ్మెల్సీలకు సూచించారు.
అయితే… వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం మండలి సమావేశాలకు హాజరు కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
సభలో బలాబలాలు ఇవే:
- శాసనమండలి (మొత్తం 58 స్థానాలు ): వైఎస్‌ఆర్‌సీపీ 32, టీడీపీ 10, ఇండిపెండెంట్లు 5, నామినేటెడ్ 6, జనాసేన 2, బీజేపీ 1 కాగా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
- శాసనసభ (మొత్తం 175 స్థానాలు) : టీడీపీ 135, జనసేన 21, వైఎస్‌ఆర్‌సీపీ 11, బీజేపీ 8 స్థానాలను కలిగి ఉన్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

