Andhra Pradesh Voter List Revision : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియ షురూ అయింది. ఈ నెల రోజుల పాటు సాగే ప్రత్యేక కార్యక్రమం సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ ప్రకటించారు. ఈ ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియ వచ్చే నెల జూలై 14 వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది.

ఈ సవరణ ప్రక్రియలో భాగంగా 2026 మే 25 నాటికి ఓటర్ల జాబితాలో నమోదైన ప్రతి ఓటరుకు, వారి వివరాలు పాక్షికంగా ముందే నింపిన ఓటర్ల నమోదు ఫారం (Enumeration Form - EF) అందుతుందని సీఈఓ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
మొదటి రోజే భారీ స్పందన
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజే ఈ ప్రక్రియకు విశేష స్పందన లభించింది. కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజే క్షేత్రస్థాయిలో ఓటర్లకు 4.12 లక్షలకు పైగా నమోదు ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. వీటిలో సమాచారాన్ని సేకరించి, 4,115 ఫారాలను ఇప్పటికే డిజిటలైజ్ కూడా చేసినట్లు వివేక్ యాదవ్ వివరించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఈ ఫారాల ప్రింటింగ్ 100 శాతం పూర్తయిందని, పంపిణీ ప్రక్రియ వేగంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన రెండేళ్ల తర్వాత ఎన్నికల సంఘం మళ్లీ ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2026 జూలై 1వ తేదీని అర్హత గల తేదీగా (Qualifying Date) పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సుమారు 4.16 కోట్ల మంది ఓటర్లకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.
ఈ భారీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున సిబ్బందిని రంగంలోకి దించింది. రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (BLOs), 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs), 175 మంది నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు (EROs), 1,076 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs) మరియు 28 మంది జిల్లా ఎన్నికల అధికారులు (DEOs) ఈ విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
మీ ఇంటికే బూత్ స్థాయి అధికారులు
{{/usCountry}}ఈ భారీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున సిబ్బందిని రంగంలోకి దించింది. రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (BLOs), 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs), 175 మంది నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు (EROs), 1,076 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs) మరియు 28 మంది జిల్లా ఎన్నికల అధికారులు (DEOs) ఈ విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
మీ ఇంటికే బూత్ స్థాయి అధికారులు
{{/usCountry}}ఈ ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLOs) ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటర్ల నమోదు ఫారాల (EFs) పంపిణీ, వాటిని తిరిగి సేకరించేందుకు ఈ పర్యటనలు చేస్తారు. పాత ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్లు తమ పేరును, అలాగే తమ కుటుంబ సభ్యుల పేర్లను సరిచూసుకుని, ఈ నమోదు ఫారంలో వివరాలను భర్తీ చేయాలని సీఈఓ సూచించారు.
ఓటర్లకు సహాయం అందించేందుకు సాంకేతికతను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఓటర్లు తమ బూత్ స్థాయి అధికారితో మాట్లాడటానికి 'ECINet' యాప్‌లో ఉన్న 'Book-a-Call with BLO' సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా అవసరమైన సహాయం పొందవచ్చు.