ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణకు చెప్ పెట్టే పనిలో పడింది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) భవిష్యత్తులో మానవ వనరుల కొరతకు దారితీస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.
రూ. 25 వేల నగదు…

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం రూ. 25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీని అమలు చేస్తామని తెలిపారు. మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ ఇస్తామన్నారు. తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని సభలో తెలిపారు.
“ 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 23 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం. రాష్ట్రంలో 1.5గా ఉన్న టోటల్ ఫెర్టిలిటీ రేట్ ను 2.1కు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ పేరిట డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదన చేస్తున్నాం. మూడో సంతానానికి 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం. ప్రజల అందరి అభిప్రాయం తీసుకునేందుకు గానూ ఆన్‌లైన్‌లో ‘పాపులేషన్ మేనేజ్మెంట్’ పాలసీ డాక్యుమెంట్ ఉంచుతాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఏప్రిల్ 1 నుంచి అమలు…!
ఈ నెలాఖరు కల్లా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకి తుదిరూపం ఇచ్చి ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. “దేశంలోనే ఇది తొలి పాపులేషన్ మేనేజ్మెంట్. వృద్ధుల సంరక్షణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 175 సీహెచ్‌సీలలో రెండు వారాలకు ఒకసారి ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తాం. సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ద్వారా 50,000 రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌ను మెంటరింగ్‌లో భాగం చేస్తాం. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా చైల్డ్ కేర్ టేకర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం” అని తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు డిజిటల్ నెర్వ్ సిస్టమ్ ను ప్రాజెక్ట్ సంజీవని పేరిట రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 71 లక్షల హై-రిస్క్ కేసుల గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. 5.2 కోట్ల ప్రజల హెల్త్ రికార్డ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు.
{{/usCountry}}రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు డిజిటల్ నెర్వ్ సిస్టమ్ ను ప్రాజెక్ట్ సంజీవని పేరిట రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 71 లక్షల హై-రిస్క్ కేసుల గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. 5.2 కోట్ల ప్రజల హెల్త్ రికార్డ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు.
{{/usCountry}}“రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీ క్యాబ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నాం. ఏ ప్రాంతంలో మహిళా ఉద్యోగులు పనిచేస్తారో అక్కడ కొత్తగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.