అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి - CJIకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని సీజేఐని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు  రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. దేశంలోనే బెస్ట్ మోడల్‌గా రాజధాని అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణం జరుగుతోందని వివరించారు.

Published on: Mar 2, 2026, 07:31:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు… భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో ఆదివారం విజయవాడలో మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది.

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి - సీఎం చంద్రబాబు
అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి - సీఎం చంద్రబాబు

ఈ సదస్సుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘రాజధాని నిర్మాణంలో జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథార్టీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ బెస్ట్ జ్యుడిషియల్ సిటీని నిర్మిస్తాం. వీటికి అవసరమైన భూములు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని తెలిపారు.

అకాడమీ ఏర్పాటు చేయండి - సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ అకాడమీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

“అమరావతిలోని జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. దీనికి సీజేఐ సహకారం కావాలి. గ్రామాల్లో మధ్యవర్తిత్వం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించేవారు. మా తండ్రి కూడా పెద్దరికం వహించి గ్రామంలో సమస్యలను పరిష్కరించారు. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే రూ.10 వేలు ఇస్తాం... కేసులు పరిష్కారం కాకున్నా రూ. 3 వేలు ఇస్తాం. కేసులు పరిష్కారమై సత్వర న్యాయం అందితే... త్వరితగతిన అభివృద్ధి సాధ్యమవుతుంది” అని సీఎం అభిప్రాయపడ్డారు.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నామని సీఎం పేర్కొన్నారు. బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

"ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,000 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, పర్యావరణ హితంగా, ఆర్థికంగా బలమైన రాజధాని ఉండేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. వికసిత్ భారత్ -2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More