నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ రకాల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. సరైన సమయంలో నోటిఫికేషన్లు రాక, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి ఏజ్ బార్ సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతున్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించనుంది.
గరిష్ట వయోపరిమితి పెంపు…

ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తో పాటు ఇతర ప్రభుత్వ నియామక సంస్థల ద్వారా చేపట్టే ఉద్యోగ ప్రకటనలకు అర్హత పరిధి విస్తరించింది. సవరించిన నిబంధనల ప్రకారం.. యూనిఫామ్ పోస్టులు మినహా మిగిలిన అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచారు.
సుదీర్ఘ కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఈ రెండేళ్ల వయోపరిమితి సడలింపు చాలా ఊరటనివ్వనుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతం కానున్న నేపథ్యంలో, వయోపరిమితి పెంపుతో మరింత ఎక్కువ మంది అభ్యర్థులు రాబోయే నోటిఫికేషన్లకు పోటీపడే అవకాశం లభించింది. ఏళ్ల తరబడి కష్టపడి చదువుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఉద్యోగాల భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రాథమిక (షార్ట్) నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీనిలో పోస్టులు, దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల షెడ్యూల్ ఉంటాయి. అక్టోబరు మొదటి వారంలో విడుదల చేసే పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో సిలబస్, రిజర్వేషన్ రోస్టర్ తదితర వివరాలు వెల్లడిస్తారు.
కొత్తగా చదువు పూర్తి చేసినవారు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అదనపు అర్హతలు సాధించినవారు అప్డేట్ చేసుకోవచ్చు. గ్రూప్-1 పోస్టుల జాబితాకు సవరణలు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాంకేతిక సమస్యలు దాదాపు తొలగినట్లే. కొత్తగా మూడు పోస్టులను గ్రూప్-1లో చేర్చగా.. మరికొన్ని పోస్టుల్లో మార్పులు చేశారు.
{{/usCountry}}కొత్తగా చదువు పూర్తి చేసినవారు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అదనపు అర్హతలు సాధించినవారు అప్డేట్ చేసుకోవచ్చు. గ్రూప్-1 పోస్టుల జాబితాకు సవరణలు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాంకేతిక సమస్యలు దాదాపు తొలగినట్లే. కొత్తగా మూడు పోస్టులను గ్రూప్-1లో చేర్చగా.. మరికొన్ని పోస్టుల్లో మార్పులు చేశారు.
{{/usCountry}}