...
...
Next Story

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికలు.. 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీల మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాల వారీ రిజర్వేషన్ల వివరాలు ఇవే..

Updated on: Oct 12, 2026, 18:02:03 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరం మెుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులతో పాటు, 106 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా రొటేషన్ పద్ధతిలో ఈ కేటాయింపులు పూర్తి చేశారు.

ఏపీ స్థానిక ఎన్నికలు
ఏపీ స్థానిక ఎన్నికలు

రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, జనరల్ మహిళలకు 5, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ కింద 4 స్థానాలను కేటాయించారు.

ఎస్టీ - మంగళగిరి - తాడేపల్లి

ఎస్సీ - రాజమహేంద్రవరం, కర్నూలు

బీసీ మహిళ- మచిలీపట్నం, కాకినాడ

బీసీ జనరల్- ఏలూరు, అనంతపురం, చిత్తూరు

జనరల్ మహిళ - గ్రేటర్ విశాఖపట్నం, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, కడప

అన్‌రిజర్వ్‌డ్ - విజయవాడ, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు

ఈ కేటాయింపుల ద్వారా విశాఖపట్నం, గుంటూరు వంటి కీలక మహానగరాలతో పాటు మొత్తం 7 కార్పొరేషన్లలో మహిళలే మేయర్ పీఠాన్ని అధిరోహించనుండటం విశేషం. రాష్ట్రంలోని 106 పురపాలక సంఘాలకు (మున్సిపాలిటీలు) కూడా రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. సామాజిక వర్గాల వారీగా ఛైర్‌పర్సన్ స్థానాల కేటాయింపులు ఇలా ఉన్నాయి.

ఎస్టీ (3 స్థానాలు): ఎస్టీ జనరల్ – 2, ఎస్టీ మహిళ – 1

ఎస్సీ(14 స్థానాలు): ఎస్సీ జనరల్ – 7, ఎస్సీ మహిళ – 7

బీసీ (36 స్థానాలు): బీసీ జనరల్ – 18, బీసీ మహిళ – 18

ఎన్నికల బరిలో రాజకీయ సమీకరణాలురిజర్వేషన్ల ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. రొటేషన్ నిబంధనల ప్రకారం గతంలో కేటాయించిన స్థానాల్లో మార్పులు చోటుచేసుకోవడంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీలకు చెందిన ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks