ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా 2029 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 50,000 హోటల్ గదులను, 10,000 హోమ్‌స్టేలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హోమ్‌స్టేల కోసం ఒక వ్యవస్థీకృత రేటింగ్ విధానం అవసరమన్నారు. పర్యాటక రంగంపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. 'మౌలిక సదుపాయాల అభివృద్ధి, వినూత్న పర్యాటక ఉత్పత్తులు, సృజనాత్మక నగర కార్యక్రమాల కలయికతో ఏపీ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రధాన గమ్యస్థానంగా ఆవిర్భవిస్తుంది.' అని పేర్కొన్నారు.

రాష్ట్ర పర్యాటక రంగ కోసం భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వినూత్న పర్యాటక కార్యక్రమాలపై ఉద్ఘాటిస్తూ ముఖ్యమంత్రి ఒక సమగ్ర వ్యూహాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రోత్సాహాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
తీరప్రాంతంలోని ప్రాజెక్టులు, అరకు లోయ, మారేడుమిల్లి, చింతపల్లి వంటి పర్యావరణ పర్యాటక కేంద్రాలను ప్రధాన గమ్యస్థానాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు.
ఫ్యామిలీలకు ప్రకృతిని సురక్షితంగా, సౌకర్యవంతంగా చేరువ చేసేందుకు వీలుగా 10-15 ప్రదేశాలలో కారవాన్ పార్కులను ఏర్పాటు చేయడం, గోదావరి పుష్కరాల ద్వారా 1,000 కారవాన్ పార్క్, టెంట్ సిటీ యూనిట్లను సృష్టించడం కూడా ఈ ప్రణాళికలలో భాగంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. అటవీ, దేవాదాయ శాఖల భాగస్వామ్యంతో పర్యావరణ, ఆలయ పర్యాటకాన్ని సమన్వయంతో ప్రోత్సహించడంతో పాటు తిరుపతి, విశాఖపట్నంలో అమ్యూజ్‌మెంట్ పార్కులను కూడా ప్రణాళిక చేస్తోంది ప్రభుత్వం. గాంధీకోట, సూర్యలంక బీచ్, బొర్రా గుహలు వంటి ప్రధాన పర్యాటక ఆకర్షణల వద్ద మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా వేగవంతం కానుంది.
పర్యాటకుల రాకపోకలను సులభతరం చేసేందుకు గోదావరి పుష్కర్ ఘాట్ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడ, శ్రీశైలం, గండికోట, కంభం చెరువులలో ఉడాన్ పథకం కింద సీప్లేన్ సేవలు, వాటర్ ఏరోడ్రోమ్లతో సహా ఆధునిక పర్యాటక విధానాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టు నుండి క్రూయిజ్ టూరిజం కూడా ఎజెండాలో ఉందని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}పర్యాటకుల రాకపోకలను సులభతరం చేసేందుకు గోదావరి పుష్కర్ ఘాట్ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడ, శ్రీశైలం, గండికోట, కంభం చెరువులలో ఉడాన్ పథకం కింద సీప్లేన్ సేవలు, వాటర్ ఏరోడ్రోమ్లతో సహా ఆధునిక పర్యాటక విధానాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టు నుండి క్రూయిజ్ టూరిజం కూడా ఎజెండాలో ఉందని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}కంటెంట్ క్రియేట్, సాంస్కృతిక పరిశ్రమలను ప్రోత్సహించే ఒక సృజనాత్మక నగరంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు. గతేడాది రాష్ట్రంలో 309.2 మిలియన్ల పర్యాటక సందర్శనలు నమోదయ్యాయని, ప్రస్తుత ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 21 శాతం వృద్ధి నమోదైందని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.