పశ్చిమమధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారుతోంది. గడిచిన 6 గంటల కాలంలో ఈ వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా పయనించిందని వాతావరణ శాఖ మరియు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్, పూరీలకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే ఏపీలోని కళింగపట్నానికి 230 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో తీరానికి దగ్గరగా కదులుతోంది. రాబోయే 12 గంటల వ్యవధిలో ఇది మరింత బలపడి 'తీవ్ర వాయుగుండం' (Deep Depression)గా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
విశాఖ -గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం
తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత ఇది మరింత ముందుకు కదిలి, రేపు రాత్రి లేదా ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో విశాఖపట్నం నుంచి ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తీరప్రాంత జిల్లాలకు భారీ వర్ష సూచన
ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉన్న ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.
గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, సముద్రం అలజడిగా మారడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, తీరప్రాంత నివాసులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం విపత్తు నిర్వహణ శాఖ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని, స్థానిక యంత్రాంగం ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
{{/usCountry}}గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, సముద్రం అలజడిగా మారడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, తీరప్రాంత నివాసులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం విపత్తు నిర్వహణ శాఖ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని, స్థానిక యంత్రాంగం ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
{{/usCountry}}