AU Admissions : ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ గడువు పొడిగింపు

AU Admissions 2026 : ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Published on: Sep 19, 2026, 06:55:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (CDOE) ద్వారా అందించే వివిధ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు సీడీవోఈ డైరెక్టర్ ఆచార్య డి.ఎ. నాయుడు ప్రకటించారు. విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ - దూరవిద్య బ్యూరో (UGC-DEB) జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూలై-ఆగస్టు 2026 విద్యా సంవత్సరానికి గానూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL - ఆఫ్‌లైన్) విధానంతో పాటు ఆన్‌లైన్ లెర్నింగ్ (OL) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఆంధ్ర యూనివర్సిటీ
ఆంధ్ర యూనివర్సిటీ

దూరవిద్య ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్‌డీఈ అధికారిక వెబ్‌సైట్ www.andhrauniversity-sde.com ని సందర్శించవచ్చు.

ఆన్‌లైన్ విధానంలో డిగ్రీలు అభ్యసించాలనుకునే వారు యూనివర్సిటీ మెయిన్ వెబ్‌సైట్ www.andhrauniversity.edu.in ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నాక్ ద్వారా A++ గ్రేడ్ పొందిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థ. 1972 నుండి ప్రారంభమైన ఇక్కడి దూరవిద్య కేంద్రం ద్వారా వేలాది మంది ఉద్యోగులు, గృహిణులు, రెగ్యులర్ డిగ్రీలు చేయలేని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

బి.ఏ, బి.కామ్ (B.Com - జనరల్, కంప్యూటర్స్), బి.ఎస్సీ (B.Sc - మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ), బి.బి.ఏ (BBA) వంటి డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ), ఎం.కామ్ (M.Com), ఎం.ఎస్సీ (మ్యాథ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, సైకాలజీ) పీజీ కోర్సులు చేయవచ్చు.

ప్రొఫెషనల్ అండ్ డిప్లొమా కోర్సుల విషయానికొస్తే.. ఎం.బి.ఏ (MBA - హెచ్.ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్), ఎం.సి.ఏ (MCA), జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (MJMC) తో పాటు వివిధ రకాల పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో అప్లై చేసే సమయంలో అభ్యర్థులు తమ పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ (పీజీ కోర్సులకైతే) సర్టిఫికేట్లతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

యూజీసీ గుర్తింపు పొందిన ఈ దూరవిద్య డిగ్రీలు రెగ్యులర్ డిగ్రీలతో సమానమైన ప్రామాణికతను కలిగి ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు, ఉన్నత చదువులకు, కార్పొరేట్ ఉద్యోగాలకు ఈ సర్టిఫికేట్లు చెల్లుబాటు అవుతాయి. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ పొడిగించిన గడువును (అక్టోబర్ 13) వినియోగించుకోవాలని వర్సిటీ యంత్రాంగం తెలిపింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More