విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య, ఆన్‌లైన్ విద్యా కేంద్రం (CDOE) ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సర్వం సిద్ధం చేసింది. 2026 విద్యా సంవత్సరానికి గానూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను జూలై 1వ తేదీన విడుదల చేయనున్నట్లు వర్సిటీ ప్రకటించింది.
ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్
{{^htLoading}} {{/htLoading}}
ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ సీడీఓఈ డైరెక్టర్ డాక్టర్ డి.అప్పలనాయుడు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం అందిస్తున్న పలు రకాల సంప్రదాయ, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలు చేస్తూ, క్రమబద్ధమైన కళాశాలలకు వెళ్లలేని వారికి, గృహిణులకు, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే గ్రామీణ విద్యార్థులకు ఏయూ దూరవిద్య ఒక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు.
ఈ డిస్టెన్స్ నోటిఫికేషన్ కింద అభ్యర్థులు పలు కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి జనరల్, స్పెషలైజ్డ్ యూజీ కోర్సులు ఉంటాయి. పీజీ కోర్సులు ఎంఏ - తెలుగు, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు ఉంటాయి. నోటిఫికేషన్ జూలై 1, 2026 తేదీన వస్తుంది.
యూజీ కోర్సులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులో గుర్తింపు పొందిన వర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏయూ నిర్వహించే ప్రవేశ పరీక్ష లేదా నిర్ణీత అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు ఆంధ్ర యూనివర్సిటీ సీడీఓఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
ఫీజుల వివరాలు, దరఖాస్తుకు చివరి తేదీ, స్టడీ సెంటర్ల సమాచారంతో కూడిన పూర్తి స్థాయి బ్రోచర్‌ను జూలై 1న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డైరెక్టర్ తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సమాచారాన్ని పరిశీలించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
{{/usCountry}}
{{#usCountry}}
ఫీజుల వివరాలు, దరఖాస్తుకు చివరి తేదీ, స్టడీ సెంటర్ల సమాచారంతో కూడిన పూర్తి స్థాయి బ్రోచర్‌ను జూలై 1న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డైరెక్టర్ తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సమాచారాన్ని పరిశీలించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.