ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశం లభించింది. ఏయూ పరిధిలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లాలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను లా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అడ్మిషన్ల సంచాలకులు (Directorate of Admissions) ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రవేశాల ప్రక్రియ కింద ఐదేళ్ల ఎల్ఎల్బీ (5-Year LL.B.), మూడేళ్ల ఎల్ఎల్బీ (3-Year LL.B.), రెండేళ్ల ఎల్ఎల్ఎమ్ (2-Year LL.M.) సెల్ఫ్ సపోర్ట్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.
ఐదేళ్ల ఎల్ఎల్బీలో మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆర్థికంగా వెనకబడిన(ఈడబ్ల్యూఎస్) వర్గాల అభ్యర్థులకు 2 సీట్లు కేటాయించారు.
మూడేళ్ల ఎల్ఎల్బీలో మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2 సీట్లు కేటాయించారు.
రెండేళ్ల ఎల్ఎల్ఎమ్లో మూడు ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉన్నాయి. Constitutional Law - 5 సీట్లు, Business Law- 5 సీట్లు, International Law - 5 సీట్లు ఉన్నాయి.
అన్ని కోర్సులకు గాను ప్ర ప్రతిపాదిత వార్షిక రుసుము రూ.90,000 గా నిర్ణయించారు. ఈ కోర్సులలో ప్రవేశాలు పూర్తిగా AP LAWCET-2026 / AP PGLCET-2026 ర్యాంకుల ఆధారంగానే చేపడతారు. మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు అక్టోబర్ 14 నుంచి సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 23 సాయంత్రం 5:00 గంటలుగా నిర్ణయించారు. పూర్తి చేసిన ఫారమ్లు అడ్మిషన్ల డైరెక్టరేట్కు చేరాల్సి ఉంటుంది. అక్టోబర్ 26న ఉదయం 11:00 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుంది.
న్యాయ విద్యకు ఆంధ్ర విశ్వవిద్యాలయ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ న్యాయ కళాశాల పేరుగాంచింది. అభ్యర్థులు దరఖాస్తు సమర్పించే ముందు తమ ర్యాంక్ కార్డు, విద్యార్హతల ధృవీకరణ పత్రాలు, కుల/ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోమని అధికారులు స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ సమయానికి అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఆంధ్ర యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
{{/usCountry}}న్యాయ విద్యకు ఆంధ్ర విశ్వవిద్యాలయ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ న్యాయ కళాశాల పేరుగాంచింది. అభ్యర్థులు దరఖాస్తు సమర్పించే ముందు తమ ర్యాంక్ కార్డు, విద్యార్హతల ధృవీకరణ పత్రాలు, కుల/ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోమని అధికారులు స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ సమయానికి అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఆంధ్ర యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
{{/usCountry}}