AP Temperatures : ఇక భానుడి ప్రతాపం - ఏపీలో పెరుగుతున్న ఎండలు, ఈ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు...!

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది.

Published on: Mar 2, 2026, 09:39:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్ర ప్రదేశ్ లో ఎండల తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాలంటే ప్రజలు వెనకడుగు వేస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు (image source Pixabay)
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు (image source Pixabay)

పెరుగుతున్న ఎండలు…

మార్చి ప్రారంభం కావటంతో ఎండల తీవ్రత పెరగటం మొదలవుతుంది. మే వరకు ఉష్ణోగ్రతలు అత్యధికంగానే రికార్డవుతుంటాయి. భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం… ఈ 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. మార్చి నెలలో సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

సెంట్రల్ ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎండతీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

టోపి,కర్చీఫ్,తెలుపు రంగుగల కాటన్ వస్త్రాలను వాడాలని పేర్కొంది. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించింది. ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్,కూల్ రూఫ్ టెక్నాలజీ,క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచితే తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలని తెలిపింది.

ఇక ఆదివారం(02- 03- 2026) అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. నందిగామ, అమరావతి, కావలి, కడప, తిరుపతి, కర్నూలుతో మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More