...
...
Next Story

SIR in Andhrapradesh : ఓటరు జాబితాలో మీ పేరు లేదా...? ఆగస్ట్ 30 వరకు ఛాన్స్, దరఖాస్తు విధానం, కావాల్సిన పత్రాలివే

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల సమర్పణకు ఎన్నికల సంఘం ఆగస్టు 30 వరకు గడువు ఇచ్చింది. https://voters.eci.gov.in వెబ్‌సైట్‌లో లేదా ECINET మొబైల్‌ యాప్‌లోకి వెళ్లి లేదా నేరుగా బీఎల్‌వోలకు సంబంధిత పత్రాలను సమర్పించొచ్చు.

Published on: Aug 4, 2026, 07:32:03 IST
Advertisement

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా జూన్ 15 నుంచి జులై 24 వరకు చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తయ్యింది. ఆ తర్వాత జూలై 31న కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ముసాయిదా జాబితాలో మీ పేరు లేకపోయినా, ఎన్యూమరేషన్ ఫారాలు అధికారులకు సమర్పించకపోయినా, లేదా వివరాల్లో ఏవైనా తప్పులున్నా సరిచేసుకునేందుకు ఎన్నికల సంఘం ఓటర్లకు మరో అవకాశం కల్పించింది.

సవరణలకు ఎన్నికల సంఘం తుది అవకాశం
సవరణలకు ఎన్నికల సంఘం తుది అవకాశం

రాబోయే అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ జాబితాకు ముందు, ఓటర్లు మరియు వివిధ రాజకీయ పార్టీల బూత్‌స్థాయి ఏజెంట్లు (BLA) తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించేందుకు జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు గడువు విధిస్తూ స్పష్టమైన షెడ్యూల్ ఖరారు చేశారు.

దరఖాస్తు విధానం…

మీ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవడానికి మరియు మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్గాల్లో పూర్తి చేసుకోవచ్చు.

  • అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ద్వారా పరిశీలించుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించవచ్చు.
  • నేరుగా మీ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (BLO), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ERO), లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (AERO) భౌతికంగా దరఖాస్తులు అందజేయవచ్చు.

2002 నాటి ఓటర్ల జాబితాతో వివరాల మ్యాపింగ్‌లో లోపాలున్న వారికి లేదా మ్యాపింగ్ చేసుకోకుండా ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేసిన వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. సెప్టెంబర్ 28 నాటికి ఈ నోటీసుల పరిష్కారం పూర్తికానుంది. విచారణ సమయంలో అర్హతను నిరూపించుకునేందుకు ఆధార్ కార్డు కాకుండా క్రింది 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని సమర్పించాల్సి ఉంటుంది.

ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఎవరి పేరునూ నోటీసు ఇవ్వకుండా…. సమగ్ర విచారణ జరపకుండా తొలగించరని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఈఆర్వో నిర్ణయంతో సంతృప్తి చెందని పక్షంలో….. ఆర్డర్ వచ్చిన 15 రోజుల్లోగా జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీలు చేసుకోవచ్చు. అక్కడ కూడా తగిన పరిష్కారం లభించకపోతే 30 రోజుల్లోగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి రెండో అప్పీలు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.

  • ఫాం-6 (Form 6) : కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి (దీనితో పాటు నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫాం సమర్పించాలి).
  • ఫాం-6A (Form 6A) : విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు (NRIలు) ఓటరుగా నమోదు చేసుకోవడానికి.
  • ఫాం-7 (Form 7) : ఓటర్ల జాబితాలో లేని, అనర్హులైన లేదా మరణించిన వారి పేర్లను తొలగించాలని అభ్యంతరం తెలిపేందుకు.
  • ఫాం-8 (Form 8) : నియోజకవర్గం లోపల లేదా వేరే నియోజకవర్గానికి చిరునామా మార్చుకోవడానికి, వివరాల్లోని తప్పుల సవరణకు, కొత్త ఎపిక్ (EPIC) కార్డు పొందేందుకు, దివ్యాంగుల వివరాల నమోదుకు దీనిని వాడాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe